Janasena Party : శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం.. హిర మండలంలో కూలి పనుల కోసం వచ్చిన వారికి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గేదెల చైతన్య అవగాహన కల్పించారు. అలానే ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న కష్టాల గురించి తెలుసుకొని జనసేన పార్టీ పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అలానే వారి కోసం మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు. అనంతరం వారితో ముచ్చటించారు. ఈ సంధర్భంగా మండల నాయకులు గొల్ల తిరుపతిరావు, బూరెల వికాస్ లు ముందుకు వచ్చి ఆ మహిళలకు సభ్యత్వానికి అయ్యే సొమ్ము తామే చెల్లిస్తామని ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు పడాల కార్తీక్, నవీన్, మూర్తి, జన తదితరులు పాల్గొన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/