Site icon Prime9

Pawan Kalyan: జగన్ వైసీపీకే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు.. పవన్ కళ్యాణ్

Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉమ్మడి కడపజిల్లాలోని సిద్దవటంలో ఆత్మహత్య చేసుకున్న 173 మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున మొత్తం రూ.1.73 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఉద్ధరిస్తున్నట్టు, కౌలు రైతులను ఆదుకుంటున్నట్లు జగన్‌ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదంతా కష్టపడినా చేతికాడ ముద్ద నోటిలోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. పంటలు దెబ్బతింటే ప్రభుత్వమిచ్చే పథకాలు కౌలు రైతుల దరి చేరడంలేదు. వెరసి పంటలు సాగు చేయలేక కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒకరిద్దరు కాదు,మూడేళ్ల వ్యవధిలో ఉమ్మడి కడప జిల్లాలో 175 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, 2019 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఒక్కరు కూడా కౌలు రైతు లేరని, అంటే లెక్కలు సరిగ్గా వేయడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిని కనీసం సాగు పెట్టుబడులు రాని పరిస్థితి. చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మాభిమానం చంపుకోలేక పలువురు రైతులు బలన్మరణాలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.

ఏపీలో మద్యం పల్లె పల్లెకు వ్యాపించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కల్తీ మద్యం తాగి వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో అల్లసాని పెద్దన పద్యాలు పొంగిస్తే, సీఎం జగన్ మద్యాన్ని పారిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ రాష్ట్రానికి కాకుండా, కేవలం వైసీపీకే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 60వేల మంది కౌలు రైతులు ఉంటే, కేవలం రెండున్నర వేల మందికే గుర్తింపు కార్డులు ఇచ్చారని ధ్వజమెత్తారు. వైసీపీకి అధికారం వచ్చిన వెంటనే, సొంత చెల్లినే జగన్ పక్కన పెట్టారని పవన్ కల్యాణ్ అన్నారు. గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన చెల్లి సొంత పార్టీ పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. ఇలా అధికారం కోసం ఇద్దరు తపన పడుతూ ఉంటే, రాష్ట్రంలో ఉన్న రాజకీయ సాధికారత లేని కులాల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. రాయల సీమలో ఎన్నో కులాలు రాజకీయ సాధికారత లేక వెనుక పడ్డాయని, వాటి గురించి ఆలోచిందే వారే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలే అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించారని, ప్రజారాజ్యం ఉండి ఉంటే ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ను వ్యక్తులపై పోరాటం చేయనని,భావాలపైనే చేస్తాన్నారు. ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం చేయాలన్నారు. అలా చేయకపోతే ఎంత చదువుకుంటే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. పేదరికానికి కులం ఉండదని గుర్తు చేశారు. కుల రాజకీయాల కోసం తాను జనసేన పార్టీని స్థాపించలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వాటి గురించి తాను ఆలోచించనన్నారు. రైతులకు వ్యవసాయం అంటే ఎనలేని ప్రేమ. అందుకే సొంతంగా భూమి లేకపోయినా సరే, కౌలుకు తీసుకుని మరీ పంటలు సాగు చేస్తుంటారు. వ్యవసాయం అనే జూదంలో తరచూ ఓడిపోతుంటారు. ప్రభుత్వ వైఫల్యాలతో, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిని కనీసం సాగు పెట్టుబడులు రాని పరిస్థితి. చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మాభిమానం చంపుకోలేక పలువురు రైతులు బలన్మరణాలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.

Exit mobile version
Skip to toolbar