Site icon Prime9

Pawan Kalyan: దేనికీ గర్జనలు.. అది కాదా నిజమైన వికేంద్రీకరణ.? అంటూ పవన్ ట్వీట్

pawan-kalyan-fire-on-ap-govt in twitter

pawan-kalyan-fire-on-ap-govt in twitter

Pawan Kalyan: రాజధానిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. వికేంద్రీకరణ ఆలోచనపై ప్రశ్నల వర్షం కురిపించారు.

‘‘దేనికి గర్జనలు?.. విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా?, దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?, ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా?, మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా?, మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా?, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా?’’ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అంతే కాకుండా దేనికి గర్జనలు? రోడ్లు వేయనందుకా? చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? సీపీఎస్ మీద మాట మార్చినందుకా? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా? పోలీసులకు టిఏ, డిఏలు ఇవ్వనందుకా? అందమైన అరకు పేరును కాస్తా గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసినందుకా? గంజాయి కేసుల్లో రాష్ట్రాన్ని ఒకటో స్థానంలో నిలిపినందుకా? దేనికి గర్జనలు అంటూ ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ట్వీట్ ద్వారా దుయ్యబట్టారు.

‘‘మూడు నగరాల్లో హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల సమూహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి హామీ ఇస్తుందా?, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వైసీపీ ప్రభుత్వం హృదయపూర్వకంగా కోరుకుంటే, పంచాయతీలు, మున్సిపాలిటీ లకు ఆర్థిక అధికారాలు, నిర్ణయాధికారాలను ఎందుకు ఇవ్వకూడదు అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలు, మున్సిపల్ అధికారులకు స్థానిక సంస్థల నిధులను ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయింది?, మీరు నిజంగా రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయరు. అన్ని అధికారాలను స్థానిక సంస్థలకు ఎందుకు బదిలీ చేయరు. ఇది నిజమైన వికేంద్రీకరణ కాదా?’’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్టర వేదికగా వైసీపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఇక దీనిపై అధికార పార్టీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

ఇదీ చదవండి:  ప్రయాణికులకు షాక్.. నేడు 163 రైళ్లు రద్దు

 

Exit mobile version