Site icon Prime9

Devineni Uma: ఐపీఎస్, ఐఏఎస్ లు.. ముస్సోరిలో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా? మాజీ మంత్రి దేవినేని ఉమ

IPS, IAS... Is this the training given to you in Mussori--Devineni Uma

IPS, IAS... Is this the training given to you in Mussori--Devineni Uma

Vijayawada: విజయవాడ రూరల్ పరిధిలోని జక్కంపూడి కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ముస్సోరిలో మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఇందుకేనా అంటూ ఐఏఎస్, ఐపీఎస్ ల నుద్ధేశించి మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల నుండి వలసవచ్చిన కూలీల నివాస ప్రాంతంలో చోటుచేసుకొంటున్న సంఘటనల నేపథ్యంలో ఆయన గత 12 రోజులుగా కాలనీ ప్రాంతాల్లో తిరుగుతూ సమస్యల పై ఆరాతీశారు.

గత కొంత కాలంగా గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లతో స్థానికులు ఇబ్బందులను కట్టడి చేసేందులో విఫలం చెందారని అన్నారు. నివాసప్రాంతాల్లో చేరిన మురికినీటితో దోమలు విజృంభించాయన్నారు. పందులు దొర్లాడుతూ ప్రజలను రోగాలభారిన పడేలా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధిలైట్లు సరిగా పనిచేయకపోవడాన్ని తప్పుబట్టారు.

ప్రజా ప్రతినిధులు చచ్చిపోయారా అంటూ విమర్శించారు. ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత అధికారులకు లేదా అంటూ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పై నోరెత్తితే అరెస్టులు చేసినా, తెదేపా నేతలు భయపడరన్నారు. పాలన అందించడంలో సీఎం జగన్ విఫలం చెందాడని ఉమా ఎద్దేవా చేశారు.

ప్రజా సమస్యల పై అధికారులకు ప్రజలముందే ఫోన్ చేసి వారికి వినిపించారు. గంజాయి అమ్మకాలను నివాస ప్రాంతాల్లోకి ఎలా అనుమతిస్తున్నారో చెప్పాలన్నారు. బ్లేడ్ బ్యాచ్ తో నిత్యవసర వస్తువులు తెచ్చుకొనేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని దేవినేని ఉమకు అధికారులకు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: MLA Maddisetty Venugopal: రాష్ట్ర ప్రభుత్వం పై దర్శి వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్..

Exit mobile version