AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాను రాను మరింత వేడెక్కుతున్నాయి.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతుంటే.. జగన్ సర్కారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తుంది.
అయితే ఈ తరుణంలోనే ఏపీలో ప్రధాన నాయకులైన సీఎం జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు నేతలు ఒకే వేదిక పైకి రానున్నారు.
రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ రాజ్ భవన్ లో అట్ హోం ఏర్పాటు చేసారు. అన్ని పార్టీల అధినేతలను ఆహ్వానించారు.
హైకోర్టు న్యాయమూర్తులతో పాటుగా ప్రభుత్వ అధికారులు.. ప్రముఖులు రాజ్ భవన్ లో జరిగే తేనేటి విందుకు హాజరు కానున్నారు.
ఇప్పటికే అన్నీ పార్టీల నేతలకు, న్యాయమూర్తులకు, అధికారులకు ఆహ్వానం అందింది.
ఒకే చోట ముగ్గురు నేతలు (AP Politics)..
ఈ మేరకు న్యాయమూర్తులు, అధికారుల సమక్షంలో ఈ ముగ్గురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేకార్షణగా మారనుంది.
మరోవైపు సీఎం జగన్ – పవన్ కళ్యాణ్ ముఖాముఖి ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వీరిద్దరి మధ్యలో అక్కడే చంద్రబాబు కూడా ఉంటుండటంతో ఈ సమావేశం పైన ఆసక్తి నెలకొని ఉంది. ఈ సంధర్భంగా రాజ్ భవన్ కు సీఎం జగన్ – భారతి దంపతులు హాజరు కానున్నారు.
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మూడు పార్టీల నేతలు వేడి పెంచుతున్న సమయంలో ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
సీఎం జగన్.. చంద్రబాబు, పవన్ ను కలుస్తారా.. ఈ ఇద్దరు అందుకు సిద్దంగా ఉన్నారా అనేది ఆసక్తి పెంచుతోంది.
పవన్ కల్యాణ్ విజయవాడలోనే ఉన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తరువాత పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.
సీఎం జగన్ హాజరు ఖరారైంది. గత ఏడాది రాజ్ భవన్ నుంచి ఆహ్వానం ఉన్నా అట్ హోం కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు.
ఈ సారి హాజరయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కూడా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
రేపటి నుంచి కుప్పం వేదికగా ప్రారంభం కానున్న లోకేష్ పాదయాత్ర పైన సమీక్ష చేయనున్నారు.
గతంలో తెలంగాణ రాజ్ భవన్ లో జరిగిన అట్ హోం కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు.
ఇప్పుడు ఏపీలో జరిగే కార్యక్రమానికి వస్తారా లేదా అనే సందిగ్ధత కొనసాగుతోంది. సీఎం జగన్ – పవన్ ముఖాముఖి కలిస్తే ఇద్దరూ ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిని పెంచుతోంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/