Site icon Prime9

Sajjala Ramakrishna Reddy: సీఎం కేసిఆర్ ను తిడితే మంత్రి హరీష్ కు సంతోషం అనుకొంటే మేము రెడీ.. సజ్జల

If you think Minister Harish will be happy, if you scold KCR

If you think Minister Harish will be happy, if you scold KCR

Amaravati: రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు. వారి వారి ఆలోచనల మేరకు పాలన ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తే మేం కూడా పరుషంగా మాట్లాడగలం. సీఎం కేసిఆర్ ను తిడితే మంత్రి హరీష్ కు సంతోషం అనుకొంటే అందుకు మేము రెడీ అని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో పేర్కొన్నారు. ఏపీలో ఉద్యోగులను, ఉపాధ్యాయులపై అక్కడి ప్రభుత్వం కర్కశంగా ప్రవర్తిస్తుందని నిన్నటి దినం తెలంగాణ మంత్రి హరీష్ రావు ఉపాధ్యాయుల సమావేశంలో పేర్కొన్న నేపథ్యంలో సజ్జల ఈ మేరకు వ్యాఖ్యానించారు.

మంత్రి హరీష్ రావు పొరుగు రాష్ట్రం గురించి మాట్లాడడం సబబు కాదన్నారు. హఠాత్తుగా సమావేశంలో మంత్రి హరీష్ కు అంత ఆవేశం ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న ఓ గ్యాంగ్ పనిగా భావించాల్సి వస్తుందన్నారు. మంత్రి మాట్లాడిన అంశం, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదన్నారు.

మీ కుటుంబంలో ఏదైనా గొడవలు ఉంటే వాటిపై మాత్రమే దృష్టి పెట్టుకోండంటూ హరీష్ కు సజ్జల వార్నింగ్ ఇచ్చారు. మీ పాలన పై మేము ఎలాంటి మాటలు అనడం లేదు. కాని మీరే వ్యవహరానికి కాలు దువ్వుతున్నారని ఆరోపించారు. స్థాయిని మరిచి ఇలాంటి మాటలు మాట్లాడం సరికాదని హరీష్ కు హెచ్చరించారు. మా ఉపాధ్యాయులకు సంబంధించి అన్ని విషయాలు చర్చించుకొంటున్నామని, అందుకు వారు కూడా అనుకూలంగా ఉన్నారని భావిస్తున్నట్లు సజ్జల పేర్కొన్నారు. మొత్తం మీద హరీష్ రావు మాట్లాడిన తర్వాత రోజున సజ్జల కౌంటర్ ఇవ్వడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

Exit mobile version