Site icon Prime9

BJP Meeting : బీజేపీ బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది

bjp prime9news

bjp prime9news

BJP Meeting : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేడు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో భారీ బహిరంగ సభ కాలేజీ చేపట్టనున్నారు . కాలేజీ ప్రిన్సిపాల్‌ నుంచి సభ అనుమతి కోసం ఈ నెల 23న అనుమతిని తీసుకున్నారు. కానీ తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ 25 న నోటీసులు పంపించారు . శాంతిభద్రతల కారణాలతో సభకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు . ప్రిన్సిపాల్‌ సభకు అంగీకరం తెలిపారని పోలీసుల వల్ల సభను రద్దు చేశారని , ఇది మంచి పద్ధతి కాదని మీడియా ముందు వెల్లడించారు . అన్ని పార్టీలకు , సభలు, సమావేశాలు నిర్వహించుకునే అందరికి హక్కు ఉంటుందని , గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను తమ పిటిషన్‌కు జత చేశామని తెలిపారు.

నిన్న మధ్యాహ్నం వరకు వాదనలు జరిగాయి . బీజేపీ నేతల పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ 26న మధ్యాహ్నం ఈ విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదించారు. యూనివర్సిటీలు, కాలేజీలు, రాజకీయ సభలకు , సమావేశాలకు వేదిక కాదని గతంలో కూడా హైకోర్టు ఇదే తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాలిజిలో పరీక్షలు జరుగుతున్నాయని, సభ కారణంగా మా కాలేజీ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని , అందుకే కాలేజీ ప్రిన్సిపాల్‌ సభకు అనుమతి రద్దు చేశారని కోర్టుకు వివరించారు. పిటిషనర్ల తరఫున అడ్వొకేట్‌ ప్రభాకర్‌ తన వాదనలు వినిపించారు. ఇతర పార్టీ పాదయాత్రలు, సభలకు అనుమతిని ఇచ్చారు , ఇప్పుడు ఈ సభకు అనుమతి ఇవ్వకపోవడం సరి కాదని న్యాయమూర్తికి వాదనలు వివరించారు. మా పై కుట్ర పండి , ప్రత్యేక రాజకీయ ఎజెండాతోనే ఈ ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు.

ఇలా వాళ్ళ వాదనలు దాదాపు 2 గంటల వాదనలు వినిపించారు . తరువాత న్యాయమూర్తి తన తుది తీర్పును ఇచ్చారు . రాష్ట్రంలో సభలు, సమావేశాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శలు ఏమి లేవని కోర్టులో గుర్తు చేశారు.ఇతర పార్టీలకు పలు సభలకు అనుమతి ఇచ్చి ఇప్పుడు ఈ సభకు అనుమతి ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. అయినా కాలేజీ , గ్రౌండ్‌ ఎక్కడ కలిసున్నాయని ప్రశ్నించారు . కాబట్టి సభ కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం లేదని వివరించారు . సభ నిర్వహణ, శాంతిభద్రతలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు మాత్రమే ఉంటుందని.. కిందిస్థాయి అధికారులకు ఉండదని ఏ మాత్రం కూడా అధికారం లేదని , ఇదే చట్టం ఇచ్చే తీర్పు అని , సభకు అనుమతి ఖచ్చితంగా ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

Exit mobile version