Site icon Prime9

Sucharitha: నా భర్త పార్టీ మారితే నేను మారుతా.. మాజీ హోంమంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు

ex minister sucharitha sensational comments on politics

ex minister sucharitha sensational comments on politics

Sucharitha: వైసీపీ లో పార్టీ ఫిరాయింపుల ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్న సమయంలో తాజాగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నాయకులు ఆనం రామ్ నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సవాళ్ళని ఎదుర్కుంటున్న వైసీపీకి సుచరిత వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి.

రాజకీయంగా తనది తన భర్త దయా సాగర్ ది ఒకటే మాట ఒకటే బాట అనీ, వారి మనుగడ వైసీపీ పార్టీతోనే అని ఒక పక్క చెబుతూనే, తన భర్త పార్టీ మారతాను వైసీపీ పార్టీ నుండి బయటకు రా అని చెబితే తన భర్త చెప్పినట్టే పార్టీ మారతాను తప్పా తాను ఒక పార్టీలో తన భర్త ఒక పార్టీలో ఉండమన్నారు సుచరిత. ఎంత రాజకీయ నాయకురాలిని అయినప్పటికీ తన భర్త అడుగు జాడల్లోనే నడుస్తాను అని తేల్చి చెప్పేసారు సుచరిత.

ముగింపు మాటలుగా ఆవిడ మాట్లాడుతూ అన్ని పార్టీల్లో ఉన్నట్టే అభిప్రాయ బేధాలు, ఒకరి మాటలు ఇంకొకరికి నచ్చకపోడాలు వైసీపీ పార్టీలోనూ ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టీ చూస్తే ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎన్నికల సమయానికి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version