BRS Meeting In Khammam: సీఎం కే. చంద్రశేఖర్ రావు బీజేపీ, మోదీ ప్రభుత్వంపై ఖమ్మంలోని బీఆర్ఎస్ సభ వేదికగా మరోసారి మండిపడ్డారు.
మోదీది ప్రైవేటైజేషన్ పాలసీ అని తమది నేషనైలేజషన్ పాలసీ అని ఆయన పేర్కొన్నారు.
2024 తర్వాత మోదీ ప్రభుత్వం కచ్చితంగా ఇంటికి వెళ్తుందని.. తాము ఢిల్లీకి వెళ్తామంటూ ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ అరాచకాలను అడ్డుకునేందుకు విపక్షాలు ఏకం కావాలని సీఎం కేసీఆర్ కోరారు.
పరిశ్రమలు, రైళ్లు, విమానాలు వంటి చాలా సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందంటూ ఆయన మండిపడ్డారు. విశాఖ ఉక్కు ను మాత్రం ఎక్కడి పోనియ్యమని వారు అమ్మినా త్వరలో మేము
అధికారంలోకి వచ్చి మళ్లీ మన సొంతం చేసుకుంటామని ఇది తన వాగ్దామని ఆయన వెల్లడించారు.
దేశంలో లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. దేశంలోని సహజ సపంద ఈ దేశ ప్రజల సొత్తని.. ఇదంతా ఏమైపోతుందని ఆయన అన్నారు.
మనం అన్ని వనరులు ఉండి కూడా ఎందుకు ఇతర దేశాలను అ36905డుక్కోవాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు.
అన్ని సహజ వనరులుండి కూడా మనం ఎందుకు ప్రపంచ బ్యాంకును అడుక్కోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఈ అంశం తనను ఎంతో కాలంగా బాధిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు.
వామపక్షాలు ఏకం కావాల్సిన సమయం..
ఖమ్మం వేదికగా అటు జాతీయ, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి బలోపేతం అవ్వాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తోన్నారు.
కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా మారాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కూడా ఇదే కావడం విశేషం.
ఇక ఈ సభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరు అవుతుండటం రాజకీయ వర్గాల్లో ఈ సభ ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈసభలో పాల్గొనడానికి ఢిల్లీ సీఎం కేజ్రివాల్, పినరయి విజయన్, అఖిలేష్, పంజాబ్ సీఎం, డి రాజా తదితరులు హైదరాబాద్ చేరుకున్నారు.
జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మారుతుందని మొదటి నుంచి కేసీఆర్ చేప్తూనే వచ్చారు.
కాగా ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేలా ఖమ్మం వేదికగా కేసీఆర్ గట్టి సందేశాన్ని ఇవ్వనున్నారు.
ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, దానిని నడిపే శక్తి బీఆర్‌ఎస్‌కు ఉందనే సంకేతాలను ఈ సభ ద్వారా కేసీఆర్ ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఖమ్మంకు వరాల జల్లు
బీఆర్ఎస్ సభ(BRS Meeting In Khammam) సందర్భంగా సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా ప్రజలకు వరాల జల్లు కురిపించారు.
జిల్లాలోని 589 గ్రామ పంచాయితీలకు .. ఒక్కొ గ్రామ పంచాయితీకి రూ. 10 లక్షలు కేటాయించారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ఇవి మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ. 30 కోట్లు చొప్పున, ఖమ్మం మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు మంజూరు చేశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/