Site icon Prime9

CM Jagan: 73 ఏళ్ల ముసలాయన్ను చూస్తే ఆ రెండే గుర్తొస్తాయి.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్స్

cm-ys-jagan-comments on chandrababu

cm-ys-jagan-comments on chandrababu

CM Jagan: ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చాక ప్రతిపక్ష నేతలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. నర్సీపట్నం వేదికగా చంద్రబాబు- పవన్ కళ్యాణ్ పై మరోసారి విరచుకుపడ్డారు. వీరిద్దరిని చూసి రాష్ట్ర ప్రజలు ఇదేం ఖర్మరా ఈ రాష్ట్రానికి.. రాజకీయానికి అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.

చంద్రబాబు – పవన్ స్టైల్ ఒక్కటే అంటూ తనదైన స్టైల్లో పంచ్ లతో ఫైర్ అయ్యారు. డ్రోన్ షాట్స్ కోసం ఇరుకు సందుల్లో జనాన్ని తీసుకొచ్చి 8 మందిని చంపేసారంటూ చంద్రబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ 73 ఏళ్ల ముసలాయన్ను చూస్తే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు – మోసం అని సీఎం ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా మంచి చేసి ఉంటే ప్రజలు ఎందుకు ఆయనను ఇంటికి పంపిస్తారని జగన్ ప్రశ్నించారు. రాజకీయాలంటే డ్రోన్లు.. డైలాగులు కాదని ఆయన విమర్శలు చేశారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇప్పటికే అమలు చేసామని చెప్పారు. చెప్పింది చేసామనే ధైర్యంతో మా పార్టీ నేతలు ప్రతీ ఇంటికి ధైర్యంగా వెళ్తున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. చేసేదే చెబుతాను.. చెప్పించే చేస్తాను.. జగన్ ఇలాగే బ్రతుకుతాడంటూ ముఖ్యమంత్రి తెలిపారు.

చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మంచి పని చేసారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా చేసానని చెప్పుకొనే చంద్రబాబు.. కుప్పంకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. కుప్పం ను వైసీపీ ప్రభుత్వం రెవిన్యూ డివిజన్ గా మార్చిందని చెప్పుకొచ్చారు. ఏ మంచి జరిగినా తన వలనే జరిగిందని చంద్రబాబు చెబుతారన్నారు. సింధు బ్యాడ్మింటన్ లో గెలిచినా తానే నేర్పించానని చెప్పుకుంటారని ఎద్దేవా చేసారు.

పెన్షన్లు తగ్గించే ప్రసక్తే లేదని.. జగన్ మనసు అది కాదని స్పష్టం చేసారు. జనవరి నుంచి పెన్షన్ 2500 నుంచి 2750కి పెంచుతున్నామన్నారు. దీనిని తట్టుకోలేకనే పెన్షన్లలో కోత విధిస్తున్నామనే ప్రచారం ప్రారంభించారని పవన్, చంద్రబాబుపై ఆయన జగన్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 39 లక్షల మందికి రూ 400 కోట్ల పెన్షన్ లు ఇస్తే.. ఇప్పుడు ప్రతీ నెలా 62 లక్షల 30 వేల మందికి రూ 1700 కోట్ల మేర పెన్షన్లు అందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: ఈ భార్యతో కాకపోతే ఆ భార్యతో అంటూ.. పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు

Exit mobile version