Chandrababu: గుంటూరు, కందుకూరు మరణాల వెనుక పోలీసుల కుట్ర- చంద్రబాబు

రాజకీయ దుమారం రేపుతున్న కందుకూరు, గుంటూరు మరణాలపై చంద్రబాబు పోలిసులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 11 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Chandrababu: రాజకీయ దుమారం రేపుతున్న కందుకూరు, గుంటూరు మరణాలపై చంద్రబాబు పోలిసులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 11 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మరణాలపై అధికార ప్రతిపక్షాలు గత పది రోజులుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.

అయితే నివారణ చర్యల పేరు మీద ఏకంగా రోడ్ షోలనే రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం జీ.వో. జారీ చేసింది. నిన్న కుప్పం రోడ్డుషోలో పోలీసులు చంద్రబాబుని అడ్డుకుని ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకోగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని దుయ్యబట్టారు చంద్రబాబు.

వారిని బయటకు రానియ్యకుండా చెయ్యాలని, టీడీపీ మీటింగులని ఫెయిల్ చెయ్యడానికి పోలీసులు ఇలాంటి సంఘటనలు దోహదపడే పరిస్థితి తెచ్చారు అన్నారు. ఈ కుట్రలో భాగంగానే కందుకూరు, గుంటూరులో జరిగిన సంఘటనలు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరిగే అరాచకాలకు పోలీసులు వత్తాసు పలకడం ఏం సమంజసం  అని చంద్రబాబు ప్రశ్నించారు.