Hyderabad: రాజాసింగ్ కు ప్రాణ హాని ఉందని భాజాపా నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడియాక్ట్ కింద జైల్లో ఉన్న ఎమ్మెల్యేను కలిసేందుకు జైలు అధికారులు ములాఖత్ కు అనుమతించక పోవడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం పై వ్యతిరేకంగా మాట్లాడిన వారి పై అధికార టిఆర్ఎస్ కక్ష తీర్చుకొంటుందని విజయశాంతి కేసిఆర్ పై నిప్పులు చెరిగారు.
చర్లపల్లి జైల్లో ఉన్న తన భర్త రాజాసింగ్ ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, ప్రత్యేక భధ్రత కల్పించాలని ఆయన సతీమణి హైకోర్టు గుమ్మం తొక్కే పరిస్ధితికి రావడం చాలా బాధాకరమన్నారు. రాజాసింగ్ ను ఓ శాసనసభ్యుడిగా కూడా గుర్తించలేని స్థితిలో సీఎం కేసిఆర్ ఉన్నాడంటూ ఆయన వ్యవహారశైలి పై ఖండించారు. రాజాసింగ్ విడుదల కోసం మహారాష్ట్ర ప్రజలు సైతం ర్యాలీలు చేస్తున్నారని విజయశాంతి అన్నారు. ప్రజలకున్న హక్కులను గుర్తించని పాలకులకు, రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేనే లేదంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.