Site icon Prime9

Bandi Sanjay: నేటితో ముగుస్తున్న బండి సంజయ్ పాదయాత్ర

Bandi sanjay

Bandi sanjay

Hyderabad: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతుంది బీజేపీ. ఇందులో భాగంగానే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే మూడు విడతల్లో పాదయాత్ర బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేశారు. ఇక నాల్గో విడత పాదయాత్ర కూడా నేటితో ముగియనుంది. సెప్టెంబర్ 12న మొదలైన బండి సంజయ్ నాల్గో విడత పాదయాత్ర 10 రోజుల పాటు సాగింది.

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ తో పాటు ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర చేశారు. ఇక ఇవాళ సాయంత్రం పెద్ద అంబేర్ పేటలో ముగింపు సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ ముగింపు సభకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ ముఖ్య అతిధిగా రానున్నారు. ప్రతిసారి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగసభకు కేంద్రమంత్రులను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ఈ సారి సాధ్వి నిరంజన్ జ్యోతిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ తీరు పై, కేసిఆర్ కుటుంబ పాలన పై, అవినీతి పై కేంద్ర మంత్రులు వరుసగా నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరును, తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు.

 

Exit mobile version