Site icon Prime9

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు

Aicc

Aicc

Munugode by poll: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివారంనాడు షోకాజ్ నోటీసులు పంపింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది.

అస్ట్రేలియా పర్యటనలో ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అస్ట్రేలియా టూర్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనను కలిసిన అభిమానులతో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని ఆయన చెప్పారు.అంతకు ముందు మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో వెలుగు చూసింది. పార్టీని చూడవద్దని ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరారు.

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు విచారణ నిర్వహించి పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మాణికం ఠాగూర్ కాంగ్రెస్ ఎఐసీసీ కు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు పంపింది. ఈ నోటీసులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version