Congress presidential polls: ఏఐసిసి ఎన్నికల్లో ఆంధ్రా ప్రతినిధుల ఓట్లు 350

22 సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి (ఏఐసిసి) ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ప్రతినిధులు 9308మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపటిదినం ఆయా రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో డెలిగేట్స్ ఓటు వేయనున్నారు.

Kurnool: 22 సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి (ఏఐసిసి) ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ప్రతినిధులు 9308మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపటిదినం ఆయా రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో డెలిగేట్స్ ఓటు వేయనున్నారు. గాంధీ కుటుంబం నుండి ఎవ్వరూ పాల్గొనని ఈ ఏఐసిసి ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిధరూర్ మద్య పోటీ ఉండనుంది.

రేపటిదినం సోమవారం జరగనున్న ఏఐసిసి ఎన్నికల్లో ఆంధ్రా నుండి 350మంది ప్రతినిధులు కర్నూలులో తమ ఓటును వేయనున్నారు. 19వ తేదిన ఫలితాలను ఏఐసిసి పార్టీ ప్రకటించనుంది. గతంలో కర్నూలుకు చెందిన దామోదరం సంజీవయ్య జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 62-64, 71-72 లలో బాధ్యతలు చేపట్టారు. ఆ పదవిలో కొనసాగుతూనే ఆయన మరణించారు.

ఏఐసిసి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం పాదయాత్ర రేపటిదినం ఉండదని పార్టీ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: నమ్ముకొన్న ప్రజలను భాజపా నట్టేట ముంచింది..ప్రియాంకా గాంధీ వాద్రా