Janasena Party : “నా సేన కోసం.. నా వంతు..” కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ. సభ్యులు సేకరించిన రూ. కోటి విరాళంను చెక్కు రూపంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అందజేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ. సమన్వయకర్తలు రాజేష్ మల్లా, శశిధర్ కొలికొండ, జనసేన నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, జగదీష్ హరిదాస్, జ్ఞానేశ్వర్ రావ్ పప్పుల, చందు గల్లా, తదితరులు పాల్గొన్నారు.