Site icon Prime9

Amogh Lila Das: స్వామి వివేకానంద చేపలు తిన్నారంటూ విమర్శలు.. సన్యాసి లీలాదాస్ పై ఇస్కాన్ వేటు

Amogh Lila Das

Amogh Lila Das

Amogh Lila Das: స్వామి వివేకానందపై అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సాధువు అమోఘ్ లీలా దాస్ చేసిన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో విమర్శలకు తావివ్వడంతో అమోఘ్ పై ఇస్కాన్ చర్యలు తీసుకుంది. ఒక నెల రోజుల పాటు లీలా దాస్‌ను ఇస్కాన్ సంస్థ నుంచి నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అమోగ్ లీలా దాస్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు. ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలకు సోషల్ మీడియాలో సైతం మంచి ఆదరణ ఉంది.

ఇటీవల లీలాదాస్ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ చేసిన ఒక ప్రవచనంలో స్వామి వివేకానందపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తావన చేస్తూ.. స్వామి వివేకానంద చేప తినడాన్ని ప్రశ్నించారు. సద్గుణ వంతులు ఎప్పుడైనా చేపను తింటారా? చేపకు కూడా బాధ ఉంటుంది, అవునా?” అని ప్రశ్నించారు. స్వామి వివేకానంద గురువైన రామకృష్ణ పరమహంసపై కూడా లీలాదాస్ కొన్ని అభ్యంతరక విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట హల్ చల్ చేశాయి. పలువురు నెటిజన్లు ఆయనపై కామెంట్లతో విరుచుకుపడ్డారు. దానితో వెంటనే స్పందించిన ‘ఇస్కాన్’ లీలాదాస్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసింది.

ఇస్కాన్ చర్యలు(Amogh Lila Das)

అవగాహన లేకుండా స్వామి వివేకానందం,  రామకృష్ణ పరమహంస బోధలపై  అమోఘ్ లీలాదాస్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని ఇస్కాన్ ఒక ప్రకటనలో తెలిపింది. నెలరోజుల పాటు సంస్థ నుంచి ఆయనను నిషేధిస్తున్నట్టు వెల్లడించింది. లీలాదాస్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని, నెలరోజుల పాటు గోవర్ధన్ కొండల్లో ప్రాయశ్చిత్తం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేయాలని.. ప్రజాజీవితానికి దూరంగా ఆయన పూర్తిగా ఏకాంతంలోకి వెళ్లాల్సి ఉంటుందని ఇస్కాన్ వెల్లడించింది. తక్షణం ఈ ఆదేశాలను అమలులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటన పేర్కొంది.

Exit mobile version