Site icon Prime9

Rahul Gandhi: మీరు ఏ సన్‌స్క్రీన్ వాడుతున్నారు? రాహుల్ గాంధీని అడిగిన తోటి పాదయాత్రికుడు

rahulgandhi

rahulgandhi

Bharat Jodo Yatra: భారత్‌ను ఏకం చేయడం లక్ష్యంగా భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగుతున్నారు. ఆయనతో పాటు పలువురు పాదయాత్రలో వెంట సాగుతున్నారు. రాహుల్ గాంధీ, తోటి పాదయాత్రికుల సంభాషణ యొక్క సంగ్రహావలోకనం భారత్ జోడో యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియోలో షేర్ చేయబడింది.

ఈ సందర్బంగా రాహుల్ ను మీరు ఏ సన్‌స్క్రీన్ ఉపయోగిస్తున్నారని తోటి పాదయాత్రికుడు అడిగారు. తాను సన్‌స్క్రీన్‌ను ఉపయోగించనని రాహుల్‌ తెలిపారు. తన తల్లి సోనియా గాంధీ తనకు సన్‌స్క్రీన్ పంపారని, అయితే తాను దానిని ఇంకా ఉపయోగించలేదని ఆయన అన్నారు. తనతో పాటు నడుస్తున్న వారితో వారి అనుభవాలు, రోజు వారీ పాదయాత్ర, భాషా అవరోధాల గురించి ఆయన చర్చించారు.

చాలా దూరం నడిచిన కొద్దిమందికి కాళ్ల పై బొబ్బలు ఎలా వచ్చాయనే విషయం పై రాహుల్, పాదయాత్రికులు చర్చించుకున్నారు. రాత్రి 7:30 నుంచి మరుసటి రోజు ఉదయం 6:30 వరకు యాత్ర ముగిసిన తర్వాత ఖాళీ సమయంలో రాహుల్ గాంధీ ఏం చేస్తారని యాత్రికుల్లో ఒకరు ప్రశ్నించారు. కొద్దిసేపు వ్యాయామం చేసి చదువుతానని రాహుల్ వెల్లడించారు. తరువాత తన తల్లి, సోదరి మరియు స్నేహితులతో ఫోన్లో మాట్లాడతానని తెలిపారు.

Exit mobile version