Site icon Prime9

Trinamool Congress Mp Mahua Moitra: చీరకట్టులో ఫుట్‌బాల్ ఆడిన ఎంపీ

Trinamool Congress Mp Mahua Moitra plays football

Trinamool Congress Mp Mahua Moitra plays football

Trinamool Congress Mp Mahua Moitra: రాజకీయ నాయుకులు మాత్రం మనుషులు కారా ఆటలు ఆడరా… మాకు అంతో ఇంతో క్రీడల్లో ప్రావీణ్యం ఉంటుంది బాస్ అంటారు కొందరు పొలిటీషియన్స్. ఈ ధోరణికి చెందిన వారే తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌హువా మొయిత్రా… ఈ ఎంపీ చీర క‌ట్టులో ఫుట్‌బాల్ మైదానంలో దిగి వీరలెవెల్లో ఆట ఆడారు. ఆమె ఆటను చూసిన వారు చప్పట్ల మోత మోతమోగించారనుకోండి.

పశ్చిమబెంగాల్ లో కృష్ణ‌న‌గ‌ర్ ఎంపీ క‌ప్ టోర్న‌మెంట్‌-2022 జరిగింది. ఈ టోర్నీకి ముఖ్య అతిథిగా ఎంపీ మహుతా మొయిత్రా హాజరయ్యారు. కాగా ఆమె చీర క‌ట్టుతో మైదానంలో దిగి ఫుట్‌బాల్‌ ఆడుతూ క్రీడాకారులను తన ఆటతో ఉత్సాహరిచారు. దీనికి సంబంధించిన ఫోటోల‌ను ఎంపీ మ‌హువా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ఆరెంజ్ క‌ల‌ర్ సారీలో ఫుడ్ బాల్ తన్నుతూ పోస్ట్ చేసిన పోటోలో ఆమె ఎంతో అట్రాక్టివ్‌గా క‌నిపించారు.
స్పోర్ట్స్ షూ వేసుకుని స‌న్‌గ్లాసెస్ పెట్టుకున్న ఆమె కిక్ షాట్ ఆడారు. మరో ఫోటోలో గోల్ కీపింగ్ చేస్తున్న‌ట్లు ఉంది. ఇక ఆ ఫోటోల‌కు ఓ ఇంట్రెస్టింగ్ ఓ కామెంట్ కూడా జోడించారు మహుతా. నిజ‌మే, నేను చీర క‌ట్టి ఫుట్‌బాల్ ఆడుతా అని ఆమె త‌న ఫోటోల‌కు కామెంట్ చేశారు. ఇక దీనిపై సోష‌ల్ మీడియా యూజ‌ర్లు సూపర్ మామ్ అంటూ ఎంపీ మ‌హువాపై కామెంట్ల వ‌ర్షం కురిపించారునుకోండి.

ఇదీ చదవండి: Bajrang Punia: భళా బజరంగ్… వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో మరో అరుదైన రికార్డ్

Exit mobile version