Noida: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఒక కార్మికుడు యజమాని తనకు చెల్లించవలసిన మొత్తాన్ని పూర్తిగా ఇవ్వలేదంటూ కోటి రూపాయల మెర్సిడెస్ కారుకు నిప్పు పెట్టాడు. రణ్‌వీర్ అనే కార్మికుడు ఒక ఇంట్లో టైల్స్ అమర్చాడు. అయితే అతనికి పూర్తి డబ్బులు రూ.2 లక్షలు చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని లగ్జరీ కారుకు నిప్పు పెట్టాడు. ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు హెల్మెట్ ధరించి మోటర్‌బైక్‌కు సమీపంలో నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతను మెర్సిడెస్ కారు వద్దకు వెళ్లి, మంట పెట్టే ముందు కారు బానెట్ పై మండే ద్రవాన్ని చల్లాడు. తరువాత అతను తన మోటర్‌బైక్ పై అక్కడి నుంచి పరారయ్యాడు.
అయితే, మెర్సిడెస్ యజమాని కుటుంబం నాన్ పేమెంట్ క్లెయిమ్‌ను తిరస్కరించింది. నిందితుడు తమకు 10 ఏళ్లుగా తెలుసునని, రెండేళ్ల క్రితం అతడిని మార్చడం వల్ల మనస్తాపం చెందాడని చెప్పారు. రణవీర్ గత 10-12 సంవత్సరాలుగా తెలుసు. అతను కుటుంబ సభ్యుడిలా ఉన్నాడు. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో అతను ఇంటికి వెళ్ళినప్పుడు మేము అతని బకాయిలన్నింటినీ క్లియర్ చేసాము. మేము ఎల్లప్పుడూ ఒకే రోజు చెల్లింపులు చేస్తాము. రూ.2 లక్షల మొత్తం పెండింగ్‌లో ఉందన్న వాదన సరికాదని కారు యజమాని కుటుంబ సభ్యులలో ఒకరైన అజయ్ చౌహాన్ అన్నారు.
మహమ్మారి సమయంలో నిందితుడు అతని ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఇంట్లో ఏదో ఒక పని కోసం మరొక మనిషిని నియమించుకున్నారని ఆయన తెలిపారు. ఇది అతనికి కోపం తెప్పించిదని కొత్త ఉద్యోగిని బెదిరించాడని పేర్కొన్నారు. మెర్సిడెస్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. నోయిడాలోని సెక్టార్ 45లో ఈ ఘటన చోటుచేసుకుంది.