Site icon Prime9

Uddhav Thackeray: రాహుల్ గాంధీకి ఉద్దవ్ ఠాక్రే హెచ్చరిక.. ఎందుకో తెలుసా?

uddhav thackrey

uddhav thackrey

Uddhav Thackeray: సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను శివసేన నాయకుడు.. ఉద్దవ్ ఠాక్రే తప్పుబట్టారు. వినాయక్ సావర్కర్ ని అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి చురకలంటించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మహారాష్ట్రలో మహా అఘాడీ వికాస్ పేరుతో కాంగ్రెస్ తో శివసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

రాహుల్ కు ఠాక్రే వార్నింగ్.. (Uddhav Thackeray)

సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను శివసేన నాయకుడు.. ఉద్దవ్ ఠాక్రే తప్పుబట్టారు. వినాయక్ సావర్కర్ ని అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి చురకలంటించారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మహారాష్ట్రాలో మహా అఘాడీ వికాస్ పేరుతో కాంగ్రెస్ తో శివసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ అభ్యర్థిత్వంపై అనర్హత వేటు పడిన విషయం విధితమే.

పరువు నష్టం కేసులో గుజరాత్‌ లోని సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేండ్లపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తరువాతి రోజే లోక్‌సభ సచివాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. బెదిరింపులు, జైలు శిక్షలకు భయపడేది లేదని, ప్రశ్నించడం ఆపేది లేదని రాహుల్ అన్నారు.

తానెప్పుడూ క్షమాపణలు చెప్పనని, నేను సావర్కర్ కాదు.. నా పేరు గాంధీ. గాంధీ ఎవరినీ క్షమాపణలు అడగరు అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

సావర్కర్ గురించి ఓ ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. వినాయక్ సావర్కర్ ని అవమానించడం సరైనది కాదని ఆయన అన్నారు.

హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ను తాను, తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఆయన్ను అవమానించడం మానుకోవాలని రాహుల్ కు ఉద్దవ్ ఠాక్రే సూచించారు.

అంతేకాదు, పదేపదే సావర్కర్ ను కించపర్చడం ద్వారా విపక్ష కూటమిలో విబేధాలు వస్తాయని, అది బీజేపీకి బలాన్ని చేకూర్చుతుందని అన్నారు.

సావర్కర్ ను అవమానిస్తే.. తాము సహించబోమని హెచ్చరిక జారీ చేశారు.

ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ముస్లింలు అధికంగా ఉండే పట్టణమైన మాలేగావ్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో ఠాక్రే పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఉద్దశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాహుల్ వారి ఉచ్చులో పడొద్దంటూ ఉద్దవ్ ఠాక్రే అన్నారు.

 

Exit mobile version