Site icon Prime9

రాబర్ట్ వాద్రా: రాబర్ట్ వాద్రా అరెస్ట్ పై రెండువారాల స్టే ఎందుకు..?

Robert Vadra

Robert Vadra

Robert Vadra: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు రాజస్థాన్ హైకోర్టులో ఊరట లభించింది. తన కస్టోడియల్ ఇంటరాగేషన్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ వాద్రా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అయితే ఆయనను రెండు వారాలపాటు అరెస్టు చేయకూడదని మాత్రం హైకోర్టు ఆదేశించింది.

వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ రాజస్థాన్‌లోని బికనీర్‌లో కొనుగోలు చేసిన 275 బిగాల భూమికి సంబంధించిన లావాదేవీలపై పోలీసు కేసు నమోదైంది. దీనిపై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ భాటి తీర్పు వెలువరిస్తూ వాద్రా ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకవడానికి అనుమతిస్తూ ఆయన అరెస్టును రెండు వారాలపాటునిలిపివేశారు. 2019లో ఈ కేసుకు సంబంధించి రాబర్ట్ మరియు అతని తల్లి మౌరీన్ వాద్రాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రశ్నించింది. తరువాత వారు కోర్టు నుండి మధ్యంతర బెయిల్ పొందారు.

నిర్వాసితులకోసం ఉద్దేశించిన భూమిని బలవంతంగా లాక్కున్నారని, దీనికోసం ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కయ్యారని ఈడీ పేర్కొంది ఈ భూమిని పొందేందుకు నకిలీ కాగితాలను సృష్టించారని కోట్లాదిరూపాయలకు అమ్మి వాద్రా అసాధారణ లాభాలను పొందారన్నది ఈడీ ఆరోపణ.

Exit mobile version