Site icon Prime9

Vijay Malya : విజయ్ మాల్యాకు ఏపీ సర్కారు షాక్.. టీటీడీ అతిథి గృహం కోసం కేటాయించిన స్థలం రద్దు

ttd shocking decision about cancelling guest house place of vijay malya

ttd shocking decision about cancelling guest house place of vijay malya

Vijay Malya : ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ఊహించని షాక్ తగిలింది. టీటీడీ గతంలో అతిథి గృహం నిర్మాణం కోసం  కేటాయించిన స్థలాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ స్థలాన్ని కాటేజ్ డొనేషన్ పథకం కింద కొత్త దాతకు కేటాయించాలని యోచిస్తోందని తెలుస్తుంది.  వెంకట విజయం అతిథి గృహం పునర్నిర్మాణం లేదా పునర్నిర్మాణం కోసం.. కొత్త దాత నుంచి రూ. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విరాళాన్ని కోరుతున్నట్లు ప్రకటించింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1991 నవంబర్ 27న టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం ద్వారా విజయ్ మాల్యాకు భూమిని కేటాయించింది. కాగా రెండేళ్ల తర్వాత మాల్యా 1993 డిసెంబర్ 8న టీటీడీతో ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తొమ్మిది సూట్లతో అతిథి గృహం నిర్మాణాన్ని 1997 డిసెంబర్ 24న ప్రారంభించారు. దానికి ‘‘వెంకట విజయం’’ అని నామకరణం కూడా చేసి టీటీడీ ట్రస్టుకు అప్పగించారు. అయితే 24 సంవత్సరాల తర్వాత మాత్రమే మాల్యాతో తిరిగి సంబంధాలు పెట్టుకోవాలని టీటీడీ నిర్ణయించుకుంది. 2017 అక్టోబర్ 11న తన ఉత్తర్వుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

కాటేజ్ డొనేషన్ పథకం కింద ఇప్పటికే ఉన్న అతిథి గృహాల పునరుద్ధరణ, పునర్నిర్మాణంపై అధ్యయనం చేసేందుకు ట్రస్ట్ బోర్డు ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీ పలు విషయాలను వెల్లడించింది.  వాటిలో మాల్యాతో టీటీడీ తుది ఒప్పందం కుదుర్చుకోలేదని.. దాతకు ఎలాంటి అధికారాలు కల్పించడం లేదని బోర్డుకు తెలియజేసింది. ఆ అతిథి గృహాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఏళ్ల తరబడి నిర్వహణ లేకపోవడంతో అక్కడ నివాసిత అనుకూల పరిస్థితులు లేవని ఇంజనీరింగ్ విభాగం ట్రస్ట్ బోర్డుకు తన నివేదికలో పేర్కొంది.

ఈ క్రమంలోనే 2023 మార్చి 21 టీటీడీ ట్రస్టు బోర్డు.. విజయ్ మాల్యాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసు 2023 ఏప్రిల్ 3న టీటీడీకి తిరిగి వచ్చింది. మరోవైపు రుణాల ఎగ‌వేత కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ విదేశాల్లో త‌ల‌దాచుకుంటున్న మాల్యాతో సంప్రదింపులు జరపలేకపోవడంతో గెస్ట్ హౌస్ స్థలాన్ని రద్దు చేసే తీర్మానాన్ని ఆమోదించింది.

Exit mobile version