New Delhi: గనుల అక్రమ తవ్వకాల (మైనింగ్) కేసులో 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ హైదరాబాదు సీబీఐ కోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గాలి జనార్ధన రెడ్డికి ధర్మాసనం షాకిచ్చిన్నట్లైంది. వెంటనే ట్రయిల్ మెదలు పెట్టాలని న్యాయస్ధానం పేర్కొనింది. రోజు వారీ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులు మాత్రమే బళ్లారి ప్రాంతంలో ఉండేందుకు గాలికి సర్వోత్తమ న్యాయస్ధానం అనుమతి ఇచ్చింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసిన ఈ కేసులో చాలా కాలం పాటు జైల్లోనే గాలి జనార్ధన రెడ్డి ఉన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన బెయిల్ తీసుకుని విడుదలయ్యారు. ప్రస్తుతం తన సొంతూరు బళ్లారిలోనే ఉంటున్న ఆయన పై గత నెలలో పలు ఆరోపణలను సీబీఐ చేసింది. సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించిన సీబీఐ, మొత్తం కేసునే ఆయన పక్కదోవ పట్టిస్తున్నారని కోర్టుకు తెలిపారు. పదే పదే డిశ్చార్జీ పిటిషన్లను దాఖలు చేస్తున్న నిందితులు, కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం బళ్లారిలో ఉంటున్న జనార్దన్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు పంపించాలని కూడా సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును కోరి వున్నారు. ఈ క్రమంలో తాజా సుప్రీం కోర్టు తీర్పుతో సుదీర్ఘంగా సాగుతున్న గాలి అక్రమ మైనింగ్ కేసు ఇకపై ఓ కొలిక్కి రానుంది.
ఇది కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. అభిషేక్ రావును అరెస్ట్ చేసిన సీబీఐ