Site icon Prime9

Supreme court- kejriwal: లోకసభ ఎన్నికలకు ముందు అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేసారు? ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Supreme court- kejriwal

Supreme court- kejriwal

 Supreme court- kejriwal:లోకసభ ఎన్నికలకు ముందు అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కాగా అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫున అభిషేక్‌ మనుసింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. కేజ్రీవాల్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వ్యక్తిగత స్వేచ్చ కూడా చాలా ముఖ్యమైనదని అభిప్రాయపడింది.

అభిషేక్‌ మను సింఘ్వీ వాదన ఏమిటంటే ..( Supreme court- kejriwal)

ఇదిలా ఉండగా మంగళవారం నాడు సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు కేజ్రీవాల్‌ తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (ఎంఎస్‌ఆర్‌)తో బలవంతంగా దిల్లీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించడంతో ఆయన కుమారుడు రాఘవకు బెయిల్‌ లభించిందన్నారు సింఘ్వీ. తన కుమారుడు సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉండటంతో ఎంఎస్‌ఆర్‌ దిగులు పడ్డారు. దీంతో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇప్పటికే ఎంఎస్‌ఆర్‌ పలుమార్లు స్టేట్‌మెంట్లు మార్చారని, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ప్రకటన ఇచ్చిన తర్వాత రోజే మాగుంట రాఘవకు బెయిల్‌ లభించిందన్నారు సింఘ్వీ. అరవింద్‌ కేజ్రీవాల్‌ సహాయకుడు విజయ్‌ నాయర్‌ లిక్కర్‌ కేసులో లంచాలు తీసుకున్నాడని నవంబర్‌ 2022లో అరెస్టు చేశారు. ఇక కేజ్రీవాల్‌ను మార్చి 2024లో అరెస్టు చేశారు. కేజ్రీవాల్‌ సహాయకుడిని అరెస్టు చేసిన రెండేళ్ల తర్వాత ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో దానికి ఈడీ సమాధానం చెప్పరు అని సింఘ్వీ కోర్టులో వాదించారు. ఇక మాగుంట రాఘవ విషయానికి వస్తే ఆయనపై ప్రారంభంలో కేజ్రీవాల్‌పై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. రాఘవ భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆయన మధ్యంతర బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు జడ్జి బెయిల్‌ నిరాకరించాడు. ఆమె అమ్మమ్మ పడి ఐసీయు చికిత్సచేయించుకుంటోంది. దీంతో తనకు మధ్యంతర బెయిల్‌ కావాలని డిల్లీ కోర్టులో దరఖాస్తు చేసుకోవడం కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. దీన్ని ఈడీ సవాలు చేసిందని సింఘ్వీ కోర్టుకు చెప్పారు.

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు..

రాఘవ తండ్రి ఎంఎస్‌ఆర్‌ ప్రకటన చేసిన తర్వాత ఆయన బెయిల్‌కు ఈడీ అభ్యంతరం చెప్పలేదు. ఈ సంఘటనలపై ఒక్కసారి ఫోకస్‌ పెట్టండి ఎలా బెయిల్‌ పొందారో తెలుస్తోందని సింఘ్వీ జడ్జితో అన్నారు. ఈడీ వాదన ఏమిటంటే ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు సుమారు వంద కోట్ల రూపాయలను రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు.. సౌత్‌ గ్రూపు నుంచి తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని వీరు లంచాలు తీసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. కాగా సోమవారం నాడు సింఘ్వీ కోర్టులో వాదిస్తూ.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి జైల్లో ఉంచడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే కేజ్రీవాల్‌ దోషి అని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు ఈడీ వద్ద లేవు. ఆయన స్వాతంత్ర్యాన్ని ఈడీ లాక్కొంటోందని వాదించారు.

దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న ఆధారాల ప్రకారం ఈడీ అత్యుత్సాహం ప్రదర్శించి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిందని సింఘ్వీ అన్నారు. ఈడీకి అధికారం ఉందని అరెస్టు చేయడం భావ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అరెస్టు చేయడానికి బలమైన కారణం ఉండాలని కోర్టు పేర్కొంది. కొత్త సాక్ష్యాలు ఉండాలి లేదా కేజ్రీవాల్‌ పత్ర్యక్షంగా స్కామ్‌లో పాల్గొన్నట్లు చూపించాలి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. అదే మార్చి 2024 ముందుకు ఆయన నిందితుడు ఏమాత్రం కాదు అని సింఘ్వీ సుప్రీంకోర్టులో వాదించారు.

Exit mobile version