Site icon Prime9

Tamil Nadu: గవర్నర్ జీ పదవి నుండి తప్పుకోండి.. డిఎంకే మిత్రపక్షాల డిమాండ్

Step down from the post of Governor Ji...DMK allies demand

Chennai: అనుకూలంగా ఉంటే సరి, లేదంటూ రాజ్యంగ పదవిని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను ఓ ఆటాడుకొంటున్న కేంద్ర ప్రభుత్వ చర్యలపై విసిగిపోతున్నారు. ముఖ్యంగా గవర్నర్ గిరి వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొల్లుమంటున్న తరుణంలో తాజాగా గవర్నర్ గారు మీరు పదవి నుండి తప్పుకోండంటూ తమిళనాడు అధికార ప్రభుత్వం డిఎంకే కూటమి డిమాండ్ చేసింది.

రాజ్యాంగ ధర్మాసనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం పై బహిరంగ సభల్లో విమర్శలు చేస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పదవి నుంచి తప్పుకోవాలంటూ డీఎంకే మిత్రపక్షాల నాయకులు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నర్‌ హోదా కంటే మరింత ఉన్నతమైన పదవిని ఆశిస్తూ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి బాధ్యతలు విస్మరించి ప్రవర్తిస్తున్నారని విరుచుకుపడ్డారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, ద్రవిడకళగం నేత కే వీరమణి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బాలక్ణృన్‌, సీపీఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ముత్తరసన్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ నేత కాదర్‌మొయిద్దీన్‌, డీపీఐ నేత తిరుమావళవన్‌, మనిదనేయ మక్కల్‌ కట్చి నేత జవాహిరుల్లా, తమిళగ వాళ్వురిమై కట్చి నాయకుడు వేల్‌మురుగన్‌, కొంగునాట్టు మక్కల్‌ దేశీయ కట్చి ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్‌, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు ఈ ప్రకటన పై సంతకాలు చేశారు. One Nation One Uniform: పోలీసులకు ఒకే దేశం, ఒకే యూనిఫాం ఆలోచించండి.. రాష్ట్రాలకు మోదీ సూచన

రవి గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ ప్రతిష్టను కించపరిచేలా ప్రవర్శించటం, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని డీఎంకే మిత్రపక్షాల నాయకులు ఆరోపించారు. ఇటీవల ఆయన సనాతన, ఆర్య, ద్రావిడ, షెడ్యూలు వర్గాలవారి గురించి, తిరుక్కురళ్‌ కోసం వెల్లడించిన అభిప్రాయాలన్నీ ప్రజల మధ్య చిచ్చు రగిల్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆధ్యాత్మిక భావాలు కలిగినవారైనా ద్రావిడ తరహా డీఎంకే పాలనను విమర్శించడం గర్హనీయమన్నారు.

కేంద్రంలోని బీజేపీ పాలకులకు మద్దతుగా ప్రవర్తిస్తూ డీఎంకే ప్రభుత్వ పాలన కించపరిచేలా వ్యాఖ్యలు చేయడమే గవర్నర్‌ పనిగా పెట్టుకున్నట్లు ఇటీవల ప్రకటనలు రుజువు చేస్తున్నాయని నాయకులు ఆరోపించారు. రాజ్యాంగ ధర్మాసనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న గవర్నర్‌ పదవి నుంచి తప్పుకోవడమే మంచిదని డీఎంకే మిత్ర పక్షాల నాయకులు హితవు పలికారు.

ఇది కూడా చదవండి: Freebies: ఉచితాలను నియంత్రించే అధికారం ఈసీకి లేదు.. కాంగ్రెస్

Exit mobile version