Site icon Prime9

Spreading fake news: సోషల్ మీడియానా.. జర జాగ్రత్త..

Be carefull while fake news

Be carefull while fake news

New Delhi: ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా అంటే తెలియని వారు లేరు. అలాంటి సాంకేతికతను ఉపయోగించని వారు కూడా తక్కువనే చెప్పాలి. కాలక్షేపానికో, లేదా ఇతరులను ఇరకాటంలోకి నెట్టేందుకు రూపాయి ఖర్చులేకుండానే సోషల్ మీడియా అరిచేతిలో వైకుంఠం మాదిరిగా నేటి జీవన స్రవంతిలో ఒకటిగా మారిపోయింది. రాజకీయ, వాణిజ్య వేదికలు సైతం సోషల్ మీడియాలో ప్రత్యర్దులను చితక బాదేందులో సోషల్ మీడియా కీలకమే చెప్పాలి. ఇకపై ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే కేంద్రం కొత్త చట్టాన్ని సోషల్ మీడియాలో ప్రవేశపెట్టేందుకు సిద్దమౌతుంది.

అందిన సమాచారం మేరకు కేంద్రం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే ప్రజలను కట్టడి చేసేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు నడుం బిగించింది. కొత్తగా తీసుకురానున్న నిబంధనల మేరకు తప్పుడు వార్తను అంటే ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తే 10 లక్షల రూపాయలను అపరాధ రుసుంగా విధించేలా రూపకల్పన చేస్తున్నారు. కొత్తగా తీసుకొస్తున్న మార్గదర్శకాలను సైతం పదే పదే ఉల్లంగిస్తే 10లక్షల సంఖ్యను 50లక్షల రూపాయల వరకు చేర్చేలా ప్రతిపాదనలు కేంద్రం నూతన చట్టంలో చేర్చనుంది. దీంతో ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారికి కేంద్రం దాదాపుగా లాక్ వేసేందుకు సిద్దమైంది.

రూపుదిద్దిన కొత్త చట్టాన్ని ఈ నెలాఖరు లోపు తీసుకొచ్చేందుకు అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యాపార ఉత్పత్తులపై ప్రజలను ప్రభావితం చేసే సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో ఊదరగొడుతూ ఎదుటి వారి మనోభావాలు ప్రభావితం చేసేవారిని లక్ష్యంగా కొత్త చట్టాన్ని రూపొందించిన్నట్లు తెలుస్తుంది. ప్రజలను, వినియోగదారులను తప్పుదోవ పట్టించే వారి నుండి రక్షించడమే ప్రధాన ధ్యేయంగా చెబుతున్న ఈ చట్టం ద్వారా నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఒక విధంగా కేంద్రం తీసుకొస్తున్న కొత్త సోషల్ మీడియా వ్యవస్ధ ప్రజా విపణిలో కీలకమవ్వాలని ప్రైమ్ 9 న్యూస్ ఆకాంక్షిస్తుంది.

Exit mobile version