Shubman Gill: న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్ లో చరిత్ర సృష్టించింది. మరోపైవు ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా.. చెలరేగిన శుభ్ మన్ గిల్ విరాట్ కోహ్లీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి టీ20లో భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం.. 54 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మెుత్తం 63 బంతులను ఎదుర్కొన్న గిల్.. 7 సిక్సర్లు, 12 ఫోర్లతో 126 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో రెండు రికార్డులను గిల్ బద్దలు కొట్టాడు.
యంగెస్ట్ ఇండియన్ గా రికార్డ్..
చివరి టీ20లో సెంచరీతో చెలరేగిన గిల్.. యంగెస్ట్ ఇండియన్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.
23 ఏళ్ల గిల్.. వన్డేలు, టెస్టులు, టీ20 ల్లో సెంచరీ సాధించాడు. ఈ మూడు ఫార్మాట్లలో తక్కువ వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
అత్యధిక స్కోర్.. కోహ్లీ రికార్డ్ బద్దలు
ఈ మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కిన గిల్.. విరాట్ కోహ్లీ రికార్డ్ ను తిరగరాశాడు.
పొట్టి క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా శుభ్ మన్ గిల్ నిలిచాడు.
ఇది వరకు కోహ్లీ పేరుపై 122 పరుగుల అత్యధిక స్కోర్ ఉండేది. ఈ సెంచరీని 2022 ఆసియాకప్ లో ఆఫ్టానిస్తాన్ పై కోహ్లీ 122 పరుగులు చేశాడు.
కివీస్ తో జరిగిన చివరి టీ20లో గిల్ 63 బంతుల్లో.. 126 పరుగులు చేసి కోహ్లీ రికార్డును అధిగమించాడు.
చరిత్ర సృష్టించిన భారత జట్టు..
మూడో టీ20లో న్యూజిలాండ్ పై భారత్ భారీ పరగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో ఏకంగా 168 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది. టీ20 మ్యాచ్ లో భారత్ కు పరుగుల పరంగా ఇదే పెద్ద విజయం.
ఇది వరకు ఈ రికార్డు ఐర్లాండ్ పై ఉండేది. 2018 లో జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ పై భారత్ 143 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ ఫార్మాట్ లో 100 పరుగులకు పైగా విజయం సాధించడం టీమిండియాకు ఇది మూడోది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/