Site icon Prime9

Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

U.P

U.P

Uttar Pradesh: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని లఖింపూర్  ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వ‌స్తున్న ప్రైవేట్ బ‌స్సు, లారీ ఒక‌దానికి ఒక‌టి ఢీ కొట్టడంతో ఎనిమిది మంది అక్క‌డిక‌క్క‌డే మృతిచెందగా మ‌రో 25 మంది గాయ‌ప‌డ్డారు. ప్రైవేట్ బ‌స్సు ప్ర‌యాణికుల‌తో దౌరెహ్రా నుంచి ల‌క్నోకు వెళ్తుండ‌గా ఎదురుగా వేగంగా వ‌చ్చిన లారీ ఢీకొట్టింది. ఎలా బ్రిడ్జికి స‌మీపంలో ఇసాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మరణించిన వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పటల్ కు తరలించారు. ఈ ఘ‌ట‌న‌ పై సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Exit mobile version