Site icon Prime9

Gujarat: వడోదరలో అల్లర్లు.. పోలీసులపై పెట్రోల్ బాంబులు

Riots in Vadodara...Petrol bombs on police

Riots in Vadodara...Petrol bombs on police

Vadodara: గుజరాత్ రాష్ట్రం వడోదరలో అల్లర్లు చోటుచేసుకొన్నాయి. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చే క్రమంలో వివాదం చోటుచేసుకొనింది. దీంతో ఇరువర్గాల మద్య మాటల యుద్దం తీవ్రం దాల్చింది. హఠాత్తుగా ఓ వర్గం వారు మరో వర్గం పై రాళ్లు రువ్వుకోవడం, విధ్వంసానికి దిగారు.

ఘర్షణలో ఓ బాలుడికి గాయాలైనాయి. ఘటన సమయంలో వీధిలైట్లు ఆర్పి మరీ విధ్వంసం సృష్టించడం పలు అనుమానాలకు తావిస్తుంది. అదుపులోకి తెచ్చేందుకు వచ్చిన పోలీసుల పై అల్లరిమూకలు పెట్రోల్ బాంబులు విసిరారు. పరిస్ధితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు పానిగేట్ ప్రాంతంలో గాలింపు చర్యలు, పెట్రోలింగ్ ను ముమ్మరం చేశారు.

ఘర్షణకు పాల్పడ్డవారిని గుర్తించేందుకు సీసీ కెమరాల సాయంతో పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కారణంగా భావిస్తూ 19మందిని అదుపులోకి తీసుకొన్నారు. పట్టుబడ్డ వారిలో పోలీసుల పై పెట్రోల్ బాంబు విసిరిన వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తించామని వడోదర డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ యాష్ పాల్ జగనియా తెలిపారు.

నాలుగు నెలల క్రితం కూడా ఆనంద్ జిల్లాలోని ఓ ఆలయానికి చెందిన వివాదాస్పద స్ధలంలో రెండు వర్గాల మద్య ఘర్షణ చోటుచేసుకొనివుంది. అప్పట్లో పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు బాష్పవాయివు ప్రయోగించారు. గుజరాత్ పలు చోట్ల అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి.

ఇది కూడా చదవండి: Diwali Gift: దీపావళి గిఫ్ట్.. తెచ్చి పెట్టింది కర్ణాటక మంత్రికి తంట…

Exit mobile version