Relief for Nupur Sharma in Supreme Court: ప్రవక్తపై వ్యాఖ్యాలతో, ముస్టిం మనోభావాలు దెబ్బతిన్నాయని దేశ, విదేశాల్లో నుపూర్ శర్మపై చెలరేగిన వివాదం తెలిసిందే…దీంతో బిజెపి పార్టీ నుండి నుపూర్ ను బహిష్కరించింది. సుప్రీం కోర్టు కూడా ఆమె మాటలను తప్పుబడుతూ నిప్పులు చెరిగింది.
అనంతరం జరిగిన విచారణలో కోర్టు సానుకూలంగా స్పందించింది. అరెస్టు నుండి మినహాయింపుతోపాటుగా దేశ వ్యాప్తంగా ఆమెకు వ్యతిరేకంగా నమోదౌతున్న కేసులన్నింటిని ఢీల్లీకి బదలాయించాలని సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశాలు జారీచేసింది.
ఈ తరుణంలో ముస్లిం వర్గాలు నుపూర్ శర్మపై మరో మారు కోర్టు మెట్లెక్కారు. మనోభావాలు దెబ్బతీసారని, శర్మపై కఠిన చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి లలిత్, పిటిషన్ స్వీకరించే సమయంలో ఆదేశాలు జారీ చేసటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అందుకని పిటిషన్ వాపస్ తీసుకోవడమే మంచిదని సూచించారు. దీంతో పిటిషనర్ వెనక్కి తగ్గారు. న్యాయవాది నుపూర్ శర్మకు మరోమారు సుప్రీం కోర్టులో ఊరట లభించన్నట్లైయింది.