Prime9

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో సాగుతూ.. సీనియర్ నేత మృతి

Mumbai: భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో సాగుతున్న సమయంలో విషాదం చోటుచేసుకొనింది. 62వ రోజు పాదయాత్రలో భాగంగా నాందేడ్ జిల్లా అట్కాలి గ్రామంలో జోడో యాత్ర సాగుతున్న సమయంలో కాంగ్రెస్ సేవాదళ్ నేత కృష్ణ కుమార్ పాండే పాదయాత్రలో కుప్పకూలి మరణించారు.

తొలుత పాండే కూడా అందరి కార్యకర్తలు, నేతలతో పాటుగా ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. జాతీయ జెండాను పట్టుకొని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తో పాటుగా నడక సాగించారు. అయితే కొద్ది సేపటి అనంతరం తన చేతిలోని జెండాను పక్కనే ఉన్న సన్నిహితునికి ఇచ్చి వెనక్కి మళ్లారు. ఆ తర్వాత అక్కడిక్కడే కుప్పకూలారు. వెంటనే హుటాహుటిన అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. దురదృష్నవశాత్తూ పాండే ప్రాణాలు కోల్పోయారు.

నిబద్ధత కల్గిన కాంగ్రెస్ వాది కృష్ణ కుమార్ పాండే మరణంతో జోడో యాత్రలో నిశ్శబ్ధం అలుముకొనింది. మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు, రాహుల్ గాంధీ ఆయనకు నివాళులర్పించారు. పాండే అంతిమయాత్ర ఫోటోతోపాటు జాతీయ పతాకం పట్టుకొని చెక్కుచెదరని చిరునవ్వుతో యాత్రలో నడక సాగిస్తున్న రెండింటి ఫోటోలను జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ సెల్యూట్ అంటూ ఆ నేతకు సముచిత గౌరవాన్ని తెలిపారు.

ఇది కూడా చదవండి: Navneet Rana: ఎంపీ నవనీత్ రాణాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Exit mobile version
Skip to toolbar