Site icon Prime9

Rahul Gandhi: ఐదు ప్రధాన హామీలను అమలు చేస్తాం.. చెప్పింది చేసి తీరుతాం- రాహుల్ గాంధీ

rahul gandhi

rahul gandhi

Rahul Gandhi: కర్ణాటకలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యా, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాహుల్ అన్నారు.

హామీలు చట్టాలవుతాయి..

కర్ణాటకలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యా, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాహుల్ అన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇవ్వలేదని ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అన్నారు. కర్ణాటక ప్రజలకు ఏం చెప్పామో అదే చేసి తీరుతామని స్పష్టం చేశారు.
కర్ణాటక మంత్రివర్గ మొదటి క్యాబినెట్ సమావేశంలో ఐదు హామీలు చట్టరూపం దాల్చుతాయని తెలిపారు.

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు.. మెుదటి క్యాబినెట్ సమావేశంలో చట్టాలుగా మారనున్నాయని రాహుల్ అన్నారు. ‘‘మేం ఎన్నికల్లో ఐదు హామీలు ఇచ్చాం. మేము తప్పుడు హామీలు ఇవ్వలేదని మేము చెప్తున్నాం. మేము ఏం చెప్పామో అది చేస్తాం. మరో గంట-రెండు గంటల్లో కర్ణాటక మంత్రివర్గ మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. మేం ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలు ఈ సమావేశంలోనే చట్టరూపం దాల్చుతాయి. మేము మీకు నిష్పక్షపాతమైన పాలన అందిస్తాం. అవినీతికి ఏమాత్రం తావు ఇవ్వము’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

 

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య.. డిప్యూటీగా డీకే ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

Exit mobile version