Site icon Prime9

Rahul Priyanka: మంచులో చిన్నపిల్లల్లా మారిపోయిన రాహుల్, ప్రియాంక.. వీడియో వైరల్

rahul priyanka

rahul priyanka

Rahul Priyanka: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగిసింది. ఈ ముగింపు వేడుకను శ్రీనగర్ లో కాంగ్రెస్ నిర్వహించింది. ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగా.. అందుకు పరిస్థితి భిన్నంగా మారింది. వాతావరణం పూర్తిగా మారిపోయి.. మంచు వర్షం కురిసింది. దీంతో ఆ వాతావరణం చూసి.. రాహుల్ గాంధీ చిన్నపిల్లాడిలా మారిపోయాడు. సోదరి ప్రియాంక గాందీతో కలిసి మంచులో ఆటలాడుకున్నాడు.

ప్రియాంక, రాహుల్ సరదా ఆటలు

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మంచులో ఆటలాడుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఇద్దరు చిన్నపిల్లల్లా మారి ఆడుకుంటున్న వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను రాహుల్ గాంధీ స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో రాహుల్ స్నో బాల్స్ ను వెనక దాచుకోని.. సోదరిపైకి విసరడం కనిపిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుతూ ప్రియాంకపై కూడా మంచు విసిరారు. కార్యకర్తలను ఉత్సాహ పరిచేందుకు.. రాహుల్ గాంధీ వారిపై కూడా మంచు విసిరి సంతోషంగా గడిపారు.

రాహుల్, ప్రియాంక చిన్న పిల్లల్లా మారిపోవడం చూసి కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. మంచు పడుతున్న కూడా.. రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. భారత్ జోడో యాత్ర అనుకున్నదానికంటే ఎక్కువ విజయవంతమైందని అన్నారు. ఈ యాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందని.. ప్రజల కష్టాలు దగ్గరుండి చుశానని రాహుల్ తెలిపారు.

కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర.. కశ్మీర్ లో ముగిసింది. వేల కిలోమీటర్లు.. ప్రజల మద్దతుతోనే నడిచానని రాహుల్ గాంధీ అన్నారు.

కశ్మీర్ ప్రజలకు దేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల బాధలు చూసి.. కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిపారు.

ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. ఓ దశలో యాత్ర పూర్తి చేయగలనా? లేదా అనే అనుమానం వచ్చినట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని మాటిచ్చారు.

ఈ పాదయాత్రలో ఎంతో మంది నిరుపేదలను చూసే.. తాను టీ షర్ట్ తో యాత్ర చేసినట్లు పేర్కొన్నారు.

భారత్ జోడో యాత్ర విశేషాలు..

సెప్టెంబరు 7 2022న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించారు.

విభజన రాజకీయాలతో అల్లాడుతున్న దేశ ప్రజలను ఏకం చేయడానికి.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.

సెప్టెంబరు 7న ప్రారంభమైన ఈ యాత్ర.. శ్రీనగర్‌లో ముగిసింది.

దేశంలో క్రమంగా కాంగ్రెస్ అస్థిత్వం కోల్పోతున్న సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపారు.

సుమారు 5 నెలలపాటు సాగిన ఈ యాత్ర.. 4వేల కిలోమీటర్లు కొనసాగింది.
భారత్‌ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కచ్చింతగా ప్రభావం చూపుతుందని రాహుల్ గాంధీ అన్నారు.

బీజేపీ-ఆర్‌ఎస్ఎస్ విద్వేష వైఖరికి ఈ పాదయాత్ర ప్రత్యామ్నాయ మార్గమని అన్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ పాదయాత్ర సాగింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన యాత్ర.. భారత్ లోని 12 రాష్ట్రాలను చుట్టేసింది.

150 రోజులపాటు కొనసాగిన యాత్ర.. చివరకు కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగిసింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version