Site icon Prime9

Priyanka Gandhi: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌ యాత్రలో భాగంగా రెండో రోజు రాహుల్‌ గాంధీ ఖాండ్వా జిల్లాలోని బోర్గావ్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు.కాంగ్రెస్ పార్టీ గాంధీ తోబుట్టువుల చిత్రాన్ని ట్వీట్ చేసి, “మనం కలిసి నడిస్తే మన అడుగులు మరింత బలంగా ఉంటాయి” అని పేర్కొంది.

రాహుల్ గాంధీతో తొలిసారిగా ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రెహాన్ కలిసి నడిచారు. ఈ ఉదయం మధ్యప్రదేశ్‌లోని బోర్గావ్ గ్రామం నుండి తిరిగి ప్రారంభమైన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ కూడా పాల్గొన్నారు.

డిసెంబర్ 4న మధ్యప్రదేశ్ నుంచి 380 కిలోమీటర్ల మేర యాత్ర సాగి రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. రాహుల్ గాంధీ యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించకముందే మళ్లీ నాయకత్వ మార్పు కోసం డిమాండ్లు పెరిగాయి. ఈ సమయంలో సచిన్ పైలట్ ముందుగానే వచ్చి భారత్ జోడో యాత్రలో పాల్గొనడం విశేషం.

Exit mobile version