Gujarat Elections: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. గుజరాత్ ఎన్నికలరెండవ దశ పోలింగ్ నేడు జరుగుతున్న విషయం తెలిసిందే. మోదీ పోలింగ్ బూత్‌కు వెళుతున్న ప్రజలకు అభివాదం చేస్తూ క్యూలో నిలబడి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత, తనకు స్వాగతం పలికేందుకు గుమికూడిన ప్రజలకు ప్రధాని తన సిరా వేలిని చూపించారు.. ఈరోజు ఓటింగ్‌లో పాల్గొనే వారందరినీ రికార్డు సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని కోరుతున్నాను అని మోదీ ట్వీట్ చేసారు.
ఆదివారం, దంతా నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కాంతి ఖరాడిపై కొందరు గూండాలు దాడి చేసి, ఆ తర్వాత అదృశ్యమయ్యారు. అనంతరం పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.తనపై కూడా కొందరు గూండాలు దాడి చేశారని బీజేపీ అభ్యర్థి లడ్డూ పార్ధి ఆరోపించారు.ఇద్దరూ పరస్పరం కౌంటర్ ఫిర్యాదులు చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని బనస్కాంత పోలీసులు పేర్కొన్నారు.గుజరాత్ లో రెండో దశలో 93 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.