Site icon Prime9

Gujarat Elections: గుజరాత్ రెండో విడత ఎన్నికలు ప్రారంభం

Gujarat elections phase-2

Gujarat elections phase-2

Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సెకండ్‌ ఫేజ్‌లో మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 93 స్థానాల్లో మొత్తం 2.5 కోట్ల మంది ఓటర్లు.. ఈ 61 రాజకీయ పార్టీలకు చెందిన 833 మంది మరో 285 మంది స్వతంత్ర అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ విడతలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ మొత్తం 93 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 90, దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రెండు స్థానాల్లో బరిలోకి దిగాయి. గుజరాత్‌లో తొలి విడత ఎన్నికలు ఈ నెల 1న జరిగాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ కోసం మొత్తం 26,409 పోలింగ్ స్టేషన్లను, దాదాపు 36 వేల ఈవీఎంలను ఏర్పాటు చేశారు. వీటిలో 93 మోడల్ పోలింగ్ స్టేషన్లు, 93 ఎకో ఫ్రెండ్లీ బూత్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి: జోడోయాత్రలో పాల్గొన్న టీచర్ పై సస్పెంన్షన్ వేటు

Exit mobile version