Site icon Prime9

Bihar Politics: బీహార్ లో రాజకీయ సంక్షోభం.. బీజేపీ గూటికి నితీష్ కమార్ ?

Bihar Politics

Bihar Politics

Bihar Politics: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు చెందిన జనతాదళ్‌ (యు)కు లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌కు మధ్య బేధాభిప్రాయాలు గురువారం తారాస్తాయికి చేరాయని పాట్నాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు తలెత్తున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న నితీష్‌ కూటమికి హ్యాండ్‌ ఇచ్చి .. రాబోయే లోకసభలో ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తారన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో బీహార్‌ బీజేపీ చీఫ్‌ సామ్రాట్‌ చౌదరితో పాటు కేంద్రమంత్రి అశ్విని చౌబేలు పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

పాట్నాలో నితీష్‌ ఇంట్లో రాజకీయ హడావుడి కనిపించింది. జెడీయు నాయకులు లాలన్‌సింగ్‌, వినయ్‌కుమార్‌ చౌదరిలతో పాటు ఇతర సీనియర్‌ నాయకులు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో లాలూప్రసాద్‌ క్యాంప్‌లో జరుగుతున్న పరిణామాలపై కూడా నితీష్‌ ఫోకస్‌ పెట్టారని చెబుతున్నారు. అయితే లాలూప్రసాద్‌ మెజారిటి దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచనలో నితీష్‌ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నితీష్ కుమార్ కామెంట్స్..(Bihar Politics)

ఇక ఇటు జెడీయుకు .. ఆర్‌జెడీకి మధ్య సంబంధాలు ఎందుకు బెడిసి కొట్టాయనే విషయానికి వస్తే ..బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్‌ ఠాకూర్‌ జయంతి సందర్భగా నిర్వహించిన ర్యాలీలో నితీష్‌ పరోక్షంగా లాలూ కుటుంబపై చేసిన వ్యాఖ్యలే కారణమని చెబుతున్నారు. కర్పూరీ ఠాకూర్‌ బాటలో జెడియు నడుస్తోందన్నారు. ఆయన మాదిరిగానే తాము కూడా కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నామని పరోక్షంగా లాలూ కుటుంబసభ్యులను గురించి ప్రస్తావించారు. అదే సమయంలో కేంద్రప్రభుత్వం కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించడం పట్ల .. మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు నితీష్‌. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు.

లాలూ కుమార్తె ట్వీట్లు..

ప్రస్తుతం బీహార్‌ ప్రభుత్వంలో లాలూ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరో కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. కాగా తాజా పరిణామల నేథ్యంలో ఆర్‌జెడీ కూడా స్పందించింది. బీజేపీ వెనుకుండి నితీష్‌ ద్వారా వారసత్వ రాజకీయాల గురించి ఎగదోస్తోందని మండిపడుతోంది. ఇదిలా ఉండగా నితీష్‌ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్‌ కూతురు రోహిణి ఆచార్య ఎక్స్‌ ద్వారా చురలకలంటించారు. తమ తప్పులు తెలుసుకొని వారు ఎదుటి వారు తప్పులను ఎత్తి చూపిస్తారంటూ సోషల్‌ మీడియా ఎక్స్‌ద్వారా కామెంట్‌ చేసి తర్వాత డిలిట్‌ చేశారు.

ఇలా ఉండగా బీజేపీ వర్గాలు మాత్రం నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రిగా అంగీకరించరని చెబుతున్నారు. నితీష్‌కు చెందిన జెడీయు ఎన్‌డీయులో కలవాలనుకుంటే .. ముందుగా నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవి బీజేపీకి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ నితీష్‌ సీఎం పదవిని బీజేపీకి ఇవ్వడానికి నిరాకరిస్తే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడమే ఆయన ముందున్న ప్రత్యామ్నాయమన్న టాక్‌ కూడా పాట్నాలో వినిపిస్తోంది.

Exit mobile version