Site icon Prime9

Pm Modi : జోషిమఠ్ లో ఏం జరుగుతోంది.. ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్

pm modi meeting on joshimath shocking incidents

pm modi meeting on joshimath shocking incidents

Pm Modi : ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడం.. ఇళ్లకు పగుళ్లు రావడంతో స్థానికంగా తీవ్ర భయాందనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈ సమస్యపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పీఎం మోదీ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా, కేబినెట్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సభ్యులు సమీక్ష నిర్వహించారు. జోషిమఠ్ లో ఏం జరుగుతుందని.. పగుళ్లకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోషిమఠ్ జిల్లా అధికారులు, రాష్ట్ర సీనియర్ అధికారులుతో కూడా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ఉత్తరాఘండ్ సీఎం పుష్కర్ సింగ్ తో ఫోన్ లో మాట్లాడారు.

రాష్ట్రానికి సాధ్యమైనంత సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

జోషిమఠ్ లో జరుగుతున్న రక్షణ చర్యలు, పునరావాసం గురించి మోదీ ఆరా తీశారు.

ఇప్పటి వరకు 600 పైగా ఇళ్లను ఖాళీ చేయించి.. పునరావాస కేంద్రాలకు తరలించినట్టు ప్రధాని దృష్టికి ఆ రాష్ట ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ తీసుకువచ్చారు.

జోషీమఠ్‌లోని భూమి క్రమంగా కుంగిపోతుండటంతో రోడ్లు, ఇళ్లకు పెద్ద పగుళ్లు వస్తున్నాయి. ఓ దేవాలయం, కొన్ని ఇళ్లు కూలిపోయాయి. దాదాపు 500 ఇళ్లకు పగుళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు భూమి కుంగిపోవడానికి కారణాలేమిటో అత్యంత వేగంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

హిమాలయ సానువుల్లో చిన్న టౌన్ జోషిమఠ్. బద్రీనాథ్ క్షేత్రాన్ని మూసివేసినపుడు.. స్వామివారి విగ్రహాన్ని ఈ ప్రాంతానికి తీసుకువచ్చే పూజలు నిర్వహిస్తారు. అలకానంద, ధౌలిగంగా నదుల సంగమ స్ధానం విష్ట్రుప్రయాగ.. జోషిమఠ్ కు అత్యంత చేరువలో ఉంటుంది. అదేవిధంగా హియాలయ యాత్రలకు వెళ్లే పర్యాటకులకు, సైన్యానికి ఈ ప్రాంతమే బేస్ క్యాంప్ గా ఉంటుంది. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి…

Waltair Veerayya Trailer : మాస్ కి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయన… మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ట్రైలర్ రిలీజ్

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ..

Agniveer : ఛత్తీస్‌గఢ్‌ నుంచి మొదటి మహిళా ‘అగ్నివీర్’గా ఆటో డ్రైవర్ కుమార్తె

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version