Site icon Prime9

Odisha Train Accident : భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా “ఒడిశా రైలు ప్రమాదం”.. ఎక్స్ గ్రేషియా ప్రకటన.. ప్రముఖుల స్పందన ??

pm modi and other state cms responce on odisha train accident

pm modi and other state cms responce on odisha train accident

Odisha Train Accident : ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయినా కానీ ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భారతీయ రైల్వే చరిత్రలోనే దీనిని అత్యంత విషాదకర ఘటనగా పేర్కొంటున్నారు. కాగా ఈ మేరకు ఈ ఘోర రైలు ప్రమాద ఘటనపై కేంద్రం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా అనౌన్స్ చేసింది కేంద్రం. ఇక తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల, గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఇక ఇప్పటికే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకొని మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద విషాదం. అన్ని విభాగాల బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఎక్కడ ఉత్తమ సౌకర్యాలు ఉంటే అక్కడ ఆరోగ్య చికిత్స జరుగుతుంది. ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశామని, ఈ ప్రమాదంపై నిర్ణయం తీసుకుంటామని, మొత్తం ఘటన ఎలా జరిగిందో తెలుసుకుంటాం. ప్రస్తుతం అందరి దృష్టీ రెస్క్యూపైనే ఉంది అని తెలిపారు. అదే విధంగా పలువురు ప్రముఖులు, పలు రాష్ట్రాల సీఎంలు ఈ ఘటనపై స్పందించారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. 

హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి (Odisha Train Accident) గురవడంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వ్ ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నా ఆలోచనలు బాధితుల గురించి. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.2 లక్షల పరిహారం

రైలు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. ఒడిశా బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి అత్యవసర సహాయనిధి నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి  రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్ రైలు, యశ్వంత్ పుర రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో సుమారు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 350 మంది గాయపడ్డారు. ప్రమాదంలో బాధితులకు రైల్వే మంత్రి అశ్విన వైష్ణవ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, తీవ్రగాయాలు లేదా వైకల్యం ఏర్పడిన వారికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం..

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.  మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు విజయవంతం చేయాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.

ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- ఏపీ బాధితులపై ఆరా

ఈ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన జగన్‌ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను వెల్లడించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ కోరారు.
సీఎం మమతా బెనర్జీ పర్యటన

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను పరిశీలించేందుకు ఒడిశాకి రానున్నారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం

రైలు ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటన మనసుల్ని కలచివేస్తోంది. మృతుల కుటుంబాలకు  సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను అని యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు తమిళనాడు సీఎం ఫోన్

తమిళనాడుకు చెందిన ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉండటంతో సీఎం ఎంఎకే స్టాలిన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Exit mobile version