Petrol Diesel Rates: వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ ప్రభావం దేశంలోని ఇంధన ధరలపై పడింది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ రెండింటిపై రూ.40 పైసలు తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ధరలు నేడు అనగా మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి రానున్నట్టు తెలిపింది. దీనితో ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ రూ.97.8గా ఉండగా ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ రూ.111.67, డీజిల్ ధర రూ.99.40గా ఉంది.
దాదాపు ఆరు నెలల తరువాత ధరలు తగ్గడంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు 2 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తగ్గింపు క్రమంగా జరగనుందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చదవండి: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. కొత్త రేట్లు ఇవే