Site icon Prime9

Pawan Kalyan: కేంద్రమంత్రి మురళీధరన్‌తో భేటీ అయిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan

 Pawan Kalyan: మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఈ అల్పాహార సమావేశంలో పవన్‌తోపాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఏపీ రాజకీయ వ్యవహారాలపై చర్చించారు.

అమిత్ షా ను కలవనున్న పవన్ ..( Pawan Kalyan)

ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లంచ్లో పాల్గొంటారు. లంచ్‌లో ప్రధాని మోడీ, అమిత్ షా , జేపీ నడ్డా తో ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ మాట్లాడనున్నారు. మరోవైపు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఒక న్యూస్ చానల్ తో మాట్లాడుతూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. తాను ముఖ్యమంత్రి కావాలని జనసేన నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని.. ప్రజలు తనని సీఎం చేయాలని పవన్ అభిప్రాయపడ్డారు. వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అందరం కలిసి పోరాడాలని చెప్పారు. పవన్ తాజా వ్యాఖ్యలతో ఏపీలో పొత్తులపై చాలా వరకు క్లారిటీ వచ్చినట్టయింది అని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తెదేపాతో పొత్తు వ్యవహారం గురించి భవిష్యత్తు నిర్ణయిస్తుందని వెల్లడించారు.

ఇప్పటి వరకు టీడీపీతో కలిసి పోటీ చేస్తామనే విషయాన్ని పవన్ ప్రకటించక పోయినప్పటికి.. వైసీపీ వ్యతిరేక ఓటును మాత్రం చీలనివ్వను అని చెబుతూ వస్తున్నారు. ఇక ఢిల్లీ వేదికగా పొత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోయే పరిస్థితి ఉంది.

Exit mobile version
Skip to toolbar