Site icon Prime9

PM Narendra Modi : పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం.. మోదీ ప్రసంగం.. లైవ్

parliament special sessions started and pm narendra modi speech live

parliament special sessions started and pm narendra modi speech live

PM Narendra Modi : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజుల (సెప్టెంబర్ 18 – సెప్టెంబర్ 22) పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో 75 ఏళ్ల ప్రస్థానంతో పాటు, సాధించిన విజ‌యాలు, అనుభ‌వాలపై తొలి రోజు చ‌ర్చతో.. ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. గణేష్‌ చతుర్థి నాడు కొత్త పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నాం.. నిర్విఘ్నంగా భారత్‌ వికాస్‌ యాత్ర కొనసాగిస్తామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. విఘ్ననాయకుడి ఆశీస్సులు కూడా మనపై ఉన్నాయి.. అన్ని కలలు, సంకల్పాలు సాకారం చేసుకుందాం.. గణేష్‌ చతుర్థి రోజు నుంచి భారత్‌ నవ ప్రస్థానం ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 

ఆ తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తొలిరోజు లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందు ఈ సభ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు వేదికగా ఉండేది. ఆ తర్వాత  ఇది పార్లమెంటు భవనంగా గుర్తింపు పొందింది. అయితే మేము ఎన్నటికీ మరచిపోలేము. ఈ పార్లమెంట్ భవనాన్ని భారతీయుల స్వేదం, డబ్బుతో నిర్మించామని గర్వంగా చెప్పగలను అని అన్నారు. అదే విధంగా జీ20 సదస్సు సక్సెస్ భారత దేశానికి గర్వకారణం అని మోదీ అన్నారు. భారత్ సత్తా ఏంటో చూపించామని.. జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారని మోదీ అన్నారు. ఆఫ్రికన్ యూనియన్ జీ20 శాశ్వత సభ్యత్వం పొందినందుకు భారత్  గర్వపడుతుందని.. ఇవన్నీ భారత్ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని మోదీ విశ్వసించారు. చంద్రయాన్-3 విజయవంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, మన జెండా సగర్వంగా రెపరెపలాడుతుందని మోదీ చెప్పారు. భారతీయ విలువలు, ప్రమాణాలతోనే ఇదంతా సాధ్యమైందని తెలిపారు.

 

Exit mobile version