Site icon Prime9

Seema Haider : పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ కి లక్కీ ఛాన్స్.. బాలీవుడ్ మూవీలో ఆఫర్ !

pakisthan women Seema Haider got bollywood movie chance

pakisthan women Seema Haider got bollywood movie chance

Seema Haider : పబ్జీ గేమ్‌లో మొదలైన పరిచయంతో.. మన దేశ యువకుడిని ప్రేమించి పాకిస్థాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటి భర్తను వదిలేసి.. నలుగురు పిల్లలతో కలిసి భారత్ వచ్చింది సదరు మహిళ. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు సచిన్ మీనా అనే వ్యక్తితో పెళ్లి కూడా చేసుకుంది. అయితే కోరుకున్న వాడిని కలవడానికి నలుగురు పిల్లలతో సహ అక్రమ మార్గంలో భారత దేశంలోకి రావడంతో చిక్కుల్లో ఇరుక్కుంది.  కాగా తాజాగా అందుతున్న సమాచారం మేరకు బాలీవుడ్ లో ఛాన్స్ దక్కినట్లు తెలుస్తుంది.

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనా కొత్త ఇంటికి మారిన తర్వాత వారు ఎదుర్కొన్న ఇబ్బందులను వీడియో చూపించారు. ఆహారం, ఇతర అవసరమైన వస్తువుల కొరతను ఎదుర్కొంటున్నందున తాము జీవించడానికి చాలా కష్టపడుతున్నామని దంపతులు వీడియో లో పేర్కొన్నారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వారి పరిస్థితిని గమనించిన జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ ఆమెకు వారి చిత్రంలో అవకాశం ఇచ్చినట్లు అర్దం అవుతుంది.

జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్ల బడ్జెట్‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఏ టైలర్ మర్డర్ స్టోరీ’. ఈ చిత్రానికి జయంత్ సిన్హా, భరత్ సింగ్ లు దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ మూవీ టీం మంగళవారం గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న సీమా హైదర్‌ను కలిసింది. ఈ మేరకు చిత్ర దర్శకులు  ఆమెకు ఆడిషన్ నిర్వహించారు. అయితే భారత్ లో అక్రమంగా ప్రవేశించినందుకుగాను అరెస్ట్ అయిన సీమ ప్రస్తుతానికి బెయిల్ పై ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నుంచి క్లీన్ చీట్ పొందిన తరువాతే ఆమె ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న సీమా హైదర్ ఈ సినిమాలో `రా` ఆఫీసర్‌గా నటించనున్నారు.

ఇక ‘ఏ టైలర్ మర్డర్ స్టోరీ’ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కన్హయ్య లాల్ తేలీ అనే ఒక హిందూ టైలర్ ని జూన్ 28, 2022న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కస్టమర్లుగా వచ్చిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు హత్య చేశారు. బీజేపీ ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా లో అతను పోస్ట్ చేసినందుకు తల నరికి చంపారు ఆ దుండగులు. ఇదంతా ఒక సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఆ తరువాత కన్హయ్య లాల్ హత్య మేమే చేసామంటూ నిందితులు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మూవీ రబోతున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version