Site icon Prime9

PM Modi Comments: కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పాకిస్తాన్ ప్రార్థనలు చేస్తోంది.. ప్రధాని మోదీ

PM Modi Comments

PM Modi Comments

PM Modi Comments:ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలోని యూపీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశానికి సంబంధించిన సమాచారం టెర్రరిస్టులకు ఇచ్చి విధ్వంసం సృష్టించేశారు. కాగా కాంగ్రెస్‌ పార్టీకి పాకిస్తాన్‌కు విడదీయరాని సంబంధాలున్నాయన్నారు ప్రధాని మోదీ. ఇండియాలో కాంగ్రెస్‌ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్‌ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి ప్రార్థనలు చేస్తోందన్నారు .

కాంగ్రెస్ కు, పాకిస్తాన్ కు సంబంధాలు..(PM Modi Comments)

బలహీనమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం పాక్‌లో కూర్చున్న టెర్రరిస్టులకు ఇక్కడి సమాచారం ఇవ్వడం, వారు ఇక్కడ విధ్వంసం సృష్టించేవారు. అదే బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌లో వారి సొంత గడ్డపైనే వారి అంతు తేల్చామని చెప్పారు. ఇక్కడ ఇండియాలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడితే.. అక్కడ పాకిస్తాన్‌ పెడబొబ్బలు పెడుతోందన్నారు మోదీ. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని పాకిస్తాన్‌ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుపుతోందన్నారు. కాగా ఇక్కడి రాకుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేయాలని పాకిస్తాన్‌ ఊవ్విళ్లురుతోంది. పాకిస్తాన్‌కు కాంగ్రెస్‌కు మధ్య ఉన్న సంబంధాలు బహిర్గతం అయ్యాయని గుజరాత్‌లోని ఆనంద్‌లో ప్రధాని ఎలక్షన్‌ ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు అన్నీ అబద్దాలే వల్లే వేసిందన్నారు. రాహుల్‌ గాంధీ తరచూ మహోబత్‌ కీ దుకాణ్‌ అని చెబుతుంటారు. అంతా వట్టి బూటమకన్నారు. యూపీఏ ప్రభుత్వం పాలన అంతా శాసన్‌కాల్‌ అయితే ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వం మాత్రం సేవాకాల్‌.. ప్రజలకు సేవచేస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశాన్ని విడదీయడానికి విశ్వ ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుతం రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని నృత్యం చేస్తున్నారు. అయితే గత 75 ఏళ్లుగా రాజ్యాంగాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదని ఆయన కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు. ఈ రోజు మోదీ సర్దార్‌ పటేల్‌ కలలను సాకారం చేయాలనుకుంటున్నారన్నారు. దేశాన్ని కలిపి ఉంచాలనేదే తన ఉద్దేశమన్నారు. సమాజంలో ఒకరితో ఒకరి తగవులు పెట్టి అశాంతి సష్టించాలనేది కాంగ్రెస్‌ ఉద్దేశమన్నారు ప్రధాని.

కాంగ్రెస్ పాలనతో పోల్చి చూడండి..

గత 60 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనను చూశారు. ప్రస్తుతం బీజేపీ పది సంవత్సరాల పాలన చూస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో అశాంతి, అలజడులుండేవి. ఎన్‌డీఏప్రభుత్వం సేవల కాలం అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 60 సంవత్సరాల పాలనలో దేశంలోని 60 శాతం మంది జనాభాకు మరుగుదొడ్లు లేవన్నారు. బీజేపీ పది సంవత్సరాల పాలనలో 100 శాతం టాయిలెట్స్‌ నిర్మించి ఇచ్చామన్నారు. ఇక కాంగ్రెస్‌ పాలనలో కుళాయి నీళ్లు20 శాతం కంటే తక్కువ మంది ప్రజలకు ఉండేవి. అదే బీజేపీ 10 ఏళ్లలో75 శాతం ఇళ్లు కుళాయి నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకులను జాతీయ చేసింది.బ్యాంకులు కేవలం పేదలకే అని నమ్మబలికింది. ఈ 60 ఏళ్లలో పేదలకు బ్యాంకు ఖాతాలుతెరిచి ఇవ్వలేదన్నారు. బీజేపీ పాలనలో కేవలం పదేళ్లలో 50 కోట్ల మందికి జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు తెరిచి ఇచ్చామన్నారు ప్రధాని.ఇక గుజరాత్‌లో మొత్తం 26 లోకసభ స్థానాలకు గాను 25 స్థానాలకు మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. సూరత్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్‌ ఏకగ్రీవంగా గెలిచారు.

Exit mobile version