Site icon Prime9

Uttar Pradesh: రోడ్డువిస్తరణలో తరలిస్తున్న ఆలయానికి తన భూమిని విరాళమిచ్చిన ముస్లిం వ్యక్తి

land

land

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లాలో రహదారి విస్తరణ కోసం తరలిస్తున్న హనుమాన్ ఆలయానికి ఒక ముస్లి వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చాడు. జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ కోసం కచ్చియాని ఖేడాలోని హనుమాన్ ఆలయాన్ని తరలించడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆలయాన్ని మార్చడానికి ) అక్టోబర్ 16 నుండి గ్రౌండ్ వర్క్ జరుగుతోందని, దీని కోసం ఉత్తరప్రదేశ్‌లో మొదటిసారిగా కొత్త టెక్నిక్‌ను ఉపయోగిస్తున్నట్లు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాశికృష్ణ తెలిపారు.

మంగళవారం సాయంత్రం ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయాన్ని మార్చే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో పాటు పోలీసు బలగాలను మోహరించారు. 250 జాక్‌ల సహాయంతో, మధ్యాహ్నం మొత్తం ఆలయాన్ని పైకి లేపారు . మరోవైపు ఆలయానికి చెందిన మహంత్ రామ్ లఖన్ గిరి మాట్లాడుతూ, ఆలయాన్ని మార్చడానికి తాము అంగీకరించలేదని చెప్పారు.

ఆలయ తరలింపుపై జిల్లా కోర్టులో రెండు కేసులు దాఖలయ్యాయి. ఇదే కేసు హైకోర్టులో కూడా పెండింగ్‌లో ఉందని తెలిపారు.అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (పరిపాలన) రామ్‌సేవక్ ద్వివేది మాట్లాడుతూ, ఆలయాన్ని మార్చడానికి భూమి సమస్య తలెత్తిందని, దాని కోసం అలీ అనే వ్యక్తి ఒక బిగా భూమిని తమకు అప్పగించాడని తెలిపారు..అలీకి చెందిన ఒక బిగ భూమిని పట్టా చేశామని ఈ భూమిలో ఆలయాన్ని మారుస్తామని రాశి కృష్ణ తెలిపారు. తన భూమిని హిందూ ఆలయానికి విరాళంగా ఇవ్వడం ద్వారా అలీ అలీ హిందూ-ముస్లిం ఐక్యతకు ఉదాహరణగా నిలిచారని ఆమె అన్నారు.

Exit mobile version