Site icon Prime9

LUH HELICOPTER: భారత్ మరో ముందడుగు.. హెలికాప్టర్‌ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించిన మోదీ

LUH helicoptor

LUH helicoptor

LUH HELICOPTER: రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. కర్ణాటకలోని తుంకూరు కేంద్రంగా.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ తయారీ పరిశ్రమను ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ ప్రారంభించారు.

దేశంలో అన్ని హెలికాప్టర్ల అవసరాలను ఒక్క చోటు నుంచి తీర్చే విధంగా ఈ ఫ్యాక్టరీని నెలకొల్పారు. మెుత్తం 615 ఎకరాల్లో విస్తరించిన గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని 2016 లో మోదీ ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ సౌకర్యాలు కలిగిన ఈ ఫ్యాక్టరీలో.. ఫస్ట్ ‘లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు’ తయారు చేయబోతున్నారు. ఈ తేలికపాటి హెలికాప్టర్లు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుకానున్నాయి. మూడు టన్నుల బరువు.. సింగిల్ ఇంజన్ ఉండే ఈ హెలికాప్టర్లను అవసరాలకు అనుగుణంగా వినియోగించనున్నారు. ముందుగా సంవత్సరానికి 30 హెలికాప్టర్లు తయారు చేసి.. ఆ తర్వాత ఏడాదికి 60 నుంచి 90 వరకూ తయారు చేయనున్నారు.

భారత సాయుధ దళాలకు ఉపయోగం..

భారత సాయుధ దళాల నిర్దిష్ట అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ తేలికపాటి హెలికాప్టర్లను HALఅభివృద్ధి చేస్తోంది.

సరిహద్దులో నిఘా ఉంచడం.. ఆయుధాల రవాణా, వైద్య తరలింపు వంటి మిషన్‌లను ఈ హెలికాప్టర్లు నిర్వహించగలవు.

వీటి తయారీకి తక్కువ నిర్వహణ ఖర్చులు ఉండటంతో పాటు.. అధిక పనితీరు లక్షణాలను కలిగి ఉంది.

ఈ తేలికపాటి హెలికాప్టర్ గరిష్టంగా 3,100 కిలోల టేకాఫ్ ను కలిగి ఉంది. అలాగే.. 1,500 కిలోల ఉపయోగకరమైన లోడ్‌ను ఇది మోయగలదు.

దీని వేగం గరిష్టంగా 220 km/h కాగా.. క్రూయిజ్ వేగం 200 km/h వరకు చేరుకోగలదు.

దీంతో పాటు 6,500 మీ సర్వీస్ సీలింగ్ సుమారు 500 కిమీ పరిధితో, LUH 3-యాక్సిస్ ఆటోపైలట్‌తో అమర్చబడి ఉంటుంది.

ఆత్మనిర్భర్ భారత్..

ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఈ తేలికపాటి హెలికాప్టర్లను పూర్తిగా స్వదేశి పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు.

ఇప్పటివరకు విదేశీ పరికరాలపై ఆధారపడిన భారత్.. ఇతర దేశాల సాయం లేకుండానే వీటిని రూపొందిస్తుంది.

కచ్చితత్వం, విశ్వసనీయత, తక్కువ నిర్వహణ వ్యయంతో వీటిని తయారు చేస్తున్నారు.

క్లిష్ట పరిస్థితుల్లో కూడా పని చేయడం ఈ హెలికాప్టర్ల ప్రత్యేకత.

LUH లో గ్లాస్ కాక్‌పిట్.. డిజిటల్ ఏవియానిక్స్ తో పాటు వాతావరణ పరిస్థితులపై కచ్చితమైన సమాచారన్ని పైలట్‌లకు అందించే విధంగా రాడార్ వ్యవస్థను అమర్చారు.

దీనికి అదనంగా.. LUH యొక్క కాక్‌పిట్ లైటింగ్ సిస్టమ్ నైట్-విజన్ గాగుల్స్‌తో అనుకూలంగా ఉంటుంది.

అంటే చీకట్లో కూడా తన ఆపరేషన్ ను కచ్చితంగా నిర్వహిస్తుంది. LUH లో గన్ పాడ్‌లు, రాకెట్ లాంచర్లు నిఘా వ్యవస్థలతో సహా అనేక రకాల ఆయుధాలు అమర్చబడి ఉంటాయి.

ఈ తేలికపాటి విమానాలు.. అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లో పనిచేసేలా రూపొందించారు.

రాత్రి, పగలు, అధిక ఎత్తు, చలి, వేడి లాండి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన పని తాను చేసుకుపోతుంది.

ఇది వరకే రెండు హెలికాప్టర్ల తయారీ పూర్తి కావస్తుంది. తేలికపాటి LUH తేలికపాటి హెలికాప్టర్‌కు ట్రయల్ రన్ నిర్వహించారు.

లేహ్‌లో చల్లని వాతావరణంలో ఈ LUH మైలురాయిని చేరుకోని చరిత్ర సృష్టించింది.

సముద్ర మట్టం నుండి అధిక ఎత్తు వరకు మిషన్‌లను నిర్వహించడానికి రూపొందించబడిన LUH, అధిక ఎత్తులో తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితుల్లో 120 నాట్ల వేగాన్ని సాధించింది.

దీంతో ఈ ఘనత సాధించిన తొలి హెలికాప్టర్‌గా చరిత్రకెక్కింది.

హెచ్ఏఎల్ మరో ముందడుగు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన LUH ఇటీవలి కోల్డ్ సోక్ టెస్ట్‌లో విపరీతమైన చలి పరిస్థితులను తట్టుకోగలదని నిరూపించింది.

వాస్తవానికి 24 గంటలపాటు ప్రణాళిక వేయగా.. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీలకు చేరుకోవడంతో ఈ పరీక్షను 48 గంటలపాటు నిలిపివేశారు.

అయిన హిమాలయ ప్రాంతంలో LUH సామర్థ్యానికి తగిన విధంగా పని చేసినట్లు సంకేతాన్ని LUH సూచించింది.

విపరీతమైన పరిస్థితుల్లో కూడా సమర్ధవంతంగా పనిచేసే సామర్థ్యం LUH కలిగి ఉంది.

భవిష్యత్తులో అదనపు పరికరాలను ఉంచే సామర్థ్యాన్ని ఈ తేలికపాటి హెలికాప్టర్లు కలిగి ఉన్నాయి.

మారుతున్న కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా వీటి నిర్మాణం జరుగుతుంది.

ఈ తేలికపాటి హెలికాప్టర్ సామార్ధ్యాలు నిరూపితం కావడంతో.. ఏరో ఇండియాలో అరంగ్రేటం చేయడానికి ఇది సిద్ధంగా ఉంది.

HAL యెుక్క క్రమబద్దమైన డిజైన్ లకు అనుగుణంగా.. LUH ని రూపొందించారు.

షెడ్యూల్ ప్రకారం.. పరీక్షలను పూర్తి చేసి LUH తన లక్ష్యాలను సాధించిందడంలో ఇది సఫలమైంది.

ఇదే ఫ్యాక్టరీ నుంచి.. లైట్ కంబాట్ హెలికాప్టర్లు, ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్లు కూడా తయారు చేస్తారు.

మెయింటనెన్స్, రిపేర్ పనులు కూడా ప్రారంభించనున్నారు.

20 ఏళ్లలో 3 నుంచి 15 టన్నుల రేంజ్‌లో 1,000కి పైగా విమానాలను తయారు చేసి.. 4 లక్షల కోట్ల బిజినెస్ చేయడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్లాన్ చేస్తోంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version