Site icon Prime9

Masks are no longer mandatory in flights: ఇకపై విమానాల్లో మాస్క్‌ తప్పనిసరి కాదు..

Mask

Mask

CoronaVirus: విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఇకపై విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కేసులు తగ్గుతున్నప్పటికీ మాస్కులు ధరించడమే మంచిదని సూచించింది. ఎవరైనా మాస్కులు ధరించాలనుకుంటే.. వారి ఇష్టమేనని పేర్కొంది. కరోనా వైరస్‌ విజృంభించినప్పట్నుంచి ఇప్పటివరకు విమాన ప్రయాణికులకు మాస్కులు ధరించడం తప్పనిసరిని కఠినంగా అమలుచేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.

అయితే, కొవిడ్‌ కేసులు తగ్గడంతో ప్రయాణికులు మాస్కులు ధరించేందుకు ఉద్దేశించి విమానాల్లో చేసే జరిమానా/శిక్షార్హమైన చర్యలపై ఇకపై ఎలాంటి సూచనల్ని ప్రకటించాల్సిన అవసరం లేదని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా దేశంలో ఇవాళ 501 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 7,561 ఉండగా.. రికవరీ రేటు 98.79శాతంగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

Exit mobile version
Skip to toolbar