Site icon Prime9

Mamata Banerjee: నేతాజి విగ్రహ ఆవిష్కరణలో మమతకు అవమానం..

Shame on Mamatha

Shame on Mamatha

Kolkata: అధికారం ఉంది గదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. మీ ఇంటికి ఎంత దూరమో, మా ఇంటికి కూడా అంతే దూరమన్న సంగతి మరిచిపోతున్నారు. ఇది ఓ సామాన్యుడికో జరిగిన అవమానం కాదు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్ధలో గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన వారే స్వాతంత్ర యోదుడి విగ్రహ అవిష్కరణలో సభ్య సమాజం తలదించుకొనేలా చోటుచేసుకొన్న ఘటనకు ఇండియా గేట్ వేదికైంది.

రాష్ట్రపతి భవన్ నుండి ఇండియాగేట్ వరకు వున్న రాజ్యపధ్ పేరును కర్తవ్యపధ్ గా మార్చడం, ఆధునీకరించిన సెంట్రల్ విస్టా అవెన్యూ, 28అడుగుల నేతాజి సుభోస్ చంద్రబోస్ శిలా విగ్రహాన్ని అవిష్కరణను ప్రధాని మోదీ చేతులమీదుగా గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక శాఖాధికారులకు ఆహ్వానం పంపే క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. అండర్ సెక్రటరీ స్ధాయి అధికారి పేరుతో మమతకు ఆహ్వాన పత్రికను పంపారు. దీంతో బెంగాల్ టైగర్ గా గుర్తింపు పొందిన మమత కేంద్రం పై మరోమారు ఫైర్ అయ్యారు. సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో ఆహ్వానించాల్సిన పద్దతిని మరవడాన్ని తప్పుబట్టారు. అది కూడ ఓ ముఖ్యమంత్రికి ఇలా వ్రాయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అమర్యాదతో కూడిన నేతాజి విగ్రహ అవిష్కరణకు తాను వెళ్లలేకపోయానని ఆమె పేర్కొన్నారు. అయితే మమత నేతాజికి నివాళులర్పించేందకు కోల్ కత్తాలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ బానిసత్వ గుర్తులను చరిత్రలో కలిపేందుకే రాజ్ పధ్ పేరును మారుస్తున్నట్లు పేర్కొన్నారు. నేతాజి విగ్రహ ఏర్పాటులో శ్రమించిన శ్రామికులను రానున్న గణతంత్ర వేడుకలకు వారిని ఆహ్వానించి శ్రామిక శ్రమను గౌరవించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. కర్తవ్యపధ్ మార్గాన వెళ్లే ప్రజాప్రతినిదులకు, అధికారులకు దేశం పట్ల కర్తవ్యం గుర్తుకు వస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నేతాజిని గుర్తు చేసుకొంటూ మమత మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడి నేతాజి స్పూర్తి నేటికి ప్రజలు పాటిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర బీజెపి ప్రభుత్వానికి తాను సేవకురాలిని కానని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు.

జర్మనీలో నివసిస్తున్న నేతాజీ కుమార్తె వృద్దురాలు అనితా బోస్ ప్ఫాఫ్ ఆహ్వానం సరైన రీతిలో అందలేదని వ్యాఖ్యానించిన్నట్లు సమాచారం. అందుకని వేడుకలకు హాజరుకావడం లేదని, జపాన్‌లోని రెంకోజీ ఆలయం నుండి నేతాజీ అస్థికలను భారతదేశానికి తిరిగి తీసుకురావడంపై చర్చించడానికి ఆమె ప్రధానమంత్రిని కలవాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంటున్న రాజకీయ పార్టీలు. ఆ దిశగా అడుగుల వేయలేకపోతున్నారని అడప దడప చోటుచేసుకొంటున్న కొన్ని ఘటనలు అద్దం పడుతున్నాయి.

Exit mobile version
Skip to toolbar