Site icon Prime9

Pathaan Movie: పఠాన్ సాంగ్ పై మండిపడ్డ మధ్యప్రదేశ్ హోం మంత్రి.. నిషేధిస్తామంటూ వార్నింగ్

Pathan

Pathan

Pathaan Movie: షారూఖ్ ఖాన్ , దీపిక జంటగా నటించిన పఠాన్ చిత్రంలో బేషరమ్ రంగ్ పాట మధ్యప్రదేశ్ మంత్రి డా. నరోత్తమ్ మిశ్రాకు నచ్చలేదు. ఈ పాటలోకాషాయరంగు దుస్తులు ధరించారని వెంటనే మార్పులు చేయాలని లేకపోతే మధ్యప్రదేశ్‌లో పఠాన్‌ను నిషేధిస్తామన్నారు.

కాస్ట్యూమ్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. పాటను డర్టీ మైండ్‌సెట్‌తో చిత్రీకరించారు.పాటల సీన్లు, కాస్ట్యూమ్స్ సరిచేయాలి, లేకుంటే మధ్యప్రదేశ్‌లో సినిమాను అనుమతించాలా వద్దా అనేది ఆలోచించాల్సిన విషయం అంటూ ట్వీట్ చేసారు. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ కూడా ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. షారుఖ్ ఖాన్ చిత్రం పఠాన్‌లో కాషాయాన్నిమరియు హిందూ సంస్కృతిని అవమానించారు. సినిమా సెన్సార్ బోర్డు ఎందుకు నిద్రపోతోంది? నిషేధం విధిస్తాం! హిందూ మహాసభ వ్యతిరేకిస్తుందని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

బేషరమ్ రంగ్ సాంగ్ సోమవారం విడుదలైంది. శిల్పా రావు, కరాలీసా మోంటెరో, విశాల్, శేఖర్ పాడిన ఈ పాటలో దీపిక కాషాయరంగు బికినీ ధరించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. పఠాన్ జనవరి 25న విడుదల కానుంది.

Exit mobile version